AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mango at Night: రాత్రిళ్లు మామిడి పండ్లు మీరూ తింటున్నారా? జర భద్రం..

ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు పండ్ల మార్కెట్‌లో అత్యధికంగా కనిపించే పండ్లు మామిడి. వేసవిలో వీటి రుచులు ఆస్వాధించకుండా దాదాపు ఎవరూ ఉండలేదు. ఇవి రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మామిడి పండ్లలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, సహజ చక్కెరలు ఇందులో అధిక మొత్తంలో..

Mango at Night: రాత్రిళ్లు మామిడి పండ్లు మీరూ తింటున్నారా? జర భద్రం..
Mango
Srilakshmi C
|

Updated on: May 28, 2025 | 4:53 PM

Share

పండ్లలో రారాజు మామిడి. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు పండ్ల మార్కెట్‌లో అత్యధికంగా కనిపించే పండ్లు మామిడి. వేసవిలో వీటి రుచులు ఆస్వాధించకుండా దాదాపు ఎవరూ ఉండలేదు. ఇవి రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మామిడి పండ్లలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, సహజ చక్కెరలు ఇందులో అధిక మొత్తంలో ఉంటాయి. అయితే, మామిడి పండ్లు తినడానికి ప్రత్యేక నియమాలు ఉన్నాయి. అవి పాటించకపోతే మంచి కంటే ఎక్కువ హాని చేస్తాయి.

సాధారణంగా మామిడి పండ్లు ఉదయం లేదా మధ్యాహ్నం తినడం ఆరోగ్యానికి మంచిది. అయితే, చాలా మంది రాత్రి భోజనంతో పాటు మామిడిపండును కూడా తింటారు. చాలా మంది జ్యూస్ చేసుకుని కూడా తాగుతారు. అయితే వైద్యుల అభిప్రాయం ప్రకారం, మీరు ఉదయం లేదా మధ్యాహ్నం మామిడి పండ్లు తిన్నప్పటికీ, సూర్యాస్తమయం తర్వాత అంటే సాయంత్రం లేదా రాత్రి సమయంలో మామిడి పండ్లు తినకపోవడమే మంచిది. ఇది తీవ్రమైన శారీరక సమస్యలను కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు.

రాత్రిపూట ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. అందుకే మామిడి వంటి పోషకాలు అధికంగా ఉండే పండ్లను తినకూడదు. దీనివల్ల అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. రాత్రిపూట మామిడి పండ్లు తినడం వల్ల బరువు పెరుగుతారు. ఎందుకంటే మామిడి పండ్లలో కేలరీలు, చక్కెర అధికంగా ఉంటాయి. రాత్రిపూట ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే, బరువు పెరిగే అవకాశం ఉంది. మామిడి తినడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. అందుకే శరీరం అలసిపోయినా నిద్రపోవాలనుకోదు. రాత్రిపూట మామిడిపండు తినడం వల్ల నిద్రలేమి సమస్యలు పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్