Health Tips: షుగర్ ఉన్నవాళ్లు అరటిపండు తినొచ్చా.. అసలు విషయం తెలిస్తే అవాక్కే..

షుగర్ ఉన్నవారు అరటిపండ్లు తినవచ్చా..? షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండాలంటే అరటిపండును ఎప్పుడు తినాలి..? ఎంత తినాలి ? లేత అరటిపండు ఎందుకు మంచిది..? మీ ఆహారంలో అరటిని సురక్షితంగా చేర్చుకోవడానికి అవసరమైన గోల్డెన్ చిట్కాలు ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..

Health Tips: షుగర్ ఉన్నవాళ్లు అరటిపండు తినొచ్చా.. అసలు విషయం తెలిస్తే అవాక్కే..
మనం కొన్ని చిట్కాలను ఉపయోగించడం ద్వారా అరటిపండ్లను ఎక్కువ కాలం తాజాగా ఉంచవచ్చు. దీనివల్ల అవి చాలా రోజుల పాటు చెడిపోకుండా ఉంటాయి.అరటిపండ్లు త్వరగా చెడిపోయి నల్లగా మారుతాయి ఇదే ప్రతి ఒక్కరు ఫేస్ చేసే సమస్య. దీన్ని అదిగమించేందుకు మీరు వాటిని సాధారణ దశలతో సరిగ్గా నిల్వ చేయండి.

Updated on: Oct 02, 2025 | 3:13 PM

అరటిపండ్లు మన దేశంలో సర్వసాధారణం. గుడిలో ప్రసాదంగా, టిఫిన్ బాక్స్‌లో స్నాక్‌గా, వ్యాయామం తర్వాత శక్తి కోసం… అందరూ దీన్ని ఇష్టపడతారు. అయితే షుగర్ ఉన్నవాళ్లు అరటిపండు తినొచ్చా..? తింటే షుగర్ పెరిగుతుందా? అనే డౌట్లు చాలా మందిలో ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటిపండ్లను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాటిని తినే సమయం, పరిమాణం, అరటిపండు రకాన్ని బట్టి వాటిని సురక్షితంగా తినవచ్చు.

అరటిపండ్లు ఎందుకు మంచివి..?

అరటిపండ్లలో మన ఆరోగ్యానికి మేలు చేసే చాలా పోషకాలు ఉన్నాయి:

నెమ్మదిగా శక్తి: అరటిపండులోని కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా జీర్ణమవుతాయి. అందుకే షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగవు. ఇది చక్కెరలో ఆకస్మిక పెరుగుదలను నివారిస్తుంది.

ఫైబర్: ఇందులో ఉండే ఫైబర్ చక్కెర రక్తంలోకి త్వరగా చేరకుండా అడ్డుకుంటుంది.

పోటాషియం: కండరాలు సరిగ్గా పనిచేయడానికి, అలసట తగ్గడానికి పొటాషియం చాలా ఉపయోగపడుతుంది. వ్యాయామం చేసే షుగర్ పేషెంట్లకు ఇది మంచిది.

విటమిన్లు: విటమిన్ సి, విటమిన్ బి6 వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

మానసిక ప్రశాంతత: అరటిపండులో ఉండే విటమిన్ B6 మనసును ప్రశాంతంగా ఉంచే రసాయనాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.

షుగర్ ఉన్నవాళ్లు అరటిపండ్లు తినవచ్చా?

అరటిపండు మితమైన గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. అంటే ఇది ఇతర స్వీట్ల కంటే నెమ్మదిగా చక్కెరను పెంచుతుంది. అయితే మీరు ఎంత తింటున్నారు..? అనేదానిపై నియంత్రణ ముఖ్యం.

నిపుణుల సలహా: మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎప్పుడు, ఎంత తినాలి అనేది మీ డైటీషియన్ లేదా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

అరటిపండు తినడానికి సరైన సమయం ఏది?

అరటిపండ్లను అన్నం లేదా రోటీ వంటి కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉండే భోజనంతో కలిపి తినకూడదు.

సరైన పద్ధతి: అరటిపండ్లను ఉదయం టిఫిన్ తర్వాత లేదా మధ్యాహ్నం భోజనంలో స్నాక్‌గా తినడం మంచిది.

ఉదయం లేదా మధ్యాహ్నం తినడం వల్ల మీరు చేసే పనుల ద్వారా కేలరీలు ఖర్చవుతాయి. ఇది చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఏ రకమైన అరటిపండు తినాలి..?

అరటిపండు ఎంత పండితే.. అందులో చక్కెర శాతం అంత పెరుగుతుంది.
కొద్దిగా పండని (లేత) అరటిపండ్లను ఎంచుకోవడం వల్ల చక్కెర తక్కువగా ఉంటుంది. కాబట్టి అవి షుగర్ పేషెంట్లకు మరింత మంచివి.

రక్తంలో చక్కెర పెరగకుండా అరటిపండ్లు తినే చిట్కాలు:

చిన్నగా తినండి: ఒక పెద్ద అరటిపండుకు బదులు చిన్న అరటిపండు లేదా సగం అరటిపండు మాత్రమే తినండి.

పర్యవేక్షణ ముఖ్యం: అరటిపండు తిన్న తర్వాత మీ షుగర్ లెవెల్స్ తరచుగా చెక్ చేసుకోండి. ఎక్కువగా ఉంటే, కొన్నాళ్లు తినడం ఆపండి.

వ్యాయామం: అరటిపండు తిన్న తర్వాత చిన్నపాటి నడక లేదా తేలికపాటి వ్యాయామం చేస్తే, కార్బోహైడ్రేట్లు శక్తిగా మారతాయి.

కలపవద్దు: బియ్యం, బ్రెడ్ లేదా రోటీతో కలిపి తినకుండా స్నాక్‌గా మాత్రమే తీసుకోండి.

మధుమేహం ఉన్నవారు అరటిపండ్లను పూర్తిగా కట్ చేయాల్సిన పనిలేదు. సరైన సమయంలో, తక్కువ పరిమాణంలో, సరైన రకాన్ని ఎంచుకుంటే, అవి మీ ఆహారంలో మంచి పోషకాహారంగా మారుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..