Brussels Sprouts: క్యాబేజీని పోలి ఉండే ఈ కూరగాయ పోషకాహార నిధి.. బ్రస్సెల్స్ మొలకలతో ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో తెలుసా..!

|

Jun 10, 2024 | 6:06 PM

క్యాబేజీలా కనిపించే బ్రస్సెల్స్ మొలకలు ఉన్నాయని కొంతమందికి మాత్రమే తెలుసు. ఈ బ్రస్సెల్స్ మొలకల్లో అనేక పోషకాలు సమృద్ధిగా ఉన్నాయని మీకు తెలుసా? ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. బ్రస్సెల్స్ మొలకలను మినీ క్యాబేజీలు అని అంటారు. ఎందుకంటే ఇవి సరిగ్గా క్యాబేజీ లాగా కనిపిస్తాయి. ఆకుల అనేక పొరలను కలిగి ఉంటాయి. బ్రస్సెల్స్ చాలా చిన్నదిగా కనిపిస్తుంది. చిన్నదైన బ్రసెల్స్ లో ఉన్న పోషకాహారం, ప్రయోజనాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Brussels Sprouts: క్యాబేజీని పోలి ఉండే ఈ కూరగాయ పోషకాహార నిధి.. బ్రస్సెల్స్ మొలకలతో ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో తెలుసా..!
Brussels Sprouts Benefits
Image Credit source: pixabay
Follow us on

ఇంట్లో ఉపయోగించే కూరగాయలలో క్యాబేజీ ఒకటి. ఆకులా కనిపించే ఈ క్యాబేజీని రకరకాల ఆహారం తయారీ చేయడంలో ఉపయోగిస్తారు. కూరల్లో, పచ్చిగా, ఉడకబెట్టి , ఊరబెట్టి , ఫాస్ట్ ఫుడ్ వంటకాల్లో క్యాబేజీ ని ఉపయోగిస్తారు. కొందరు పచ్చిగా కూడా క్యాబేజీని తినేస్తారు. క్యాబేజీలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి విటమిన్ సి, బి 6, బి 13, విటమిన్ డి, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ వంటి అనేక పోషకాలు ఇందులో లభిస్తాయి, అయితే క్యాబేజీలా కనిపించే బ్రస్సెల్స్ మొలకలు ఉన్నాయని కొంతమందికి మాత్రమే తెలుసు. ఈ బ్రస్సెల్స్ మొలకల్లో అనేక పోషకాలు సమృద్ధిగా ఉన్నాయని మీకు తెలుసా? ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

బ్రస్సెల్స్ మొలకలను మినీ క్యాబేజీలు అని అంటారు. ఎందుకంటే ఇవి సరిగ్గా క్యాబేజీ లాగా కనిపిస్తాయి. ఆకుల అనేక పొరలను కలిగి ఉంటాయి. బ్రస్సెల్స్ చాలా చిన్నదిగా కనిపిస్తుంది. చిన్నదైన బ్రసెల్స్ లో ఉన్న పోషకాహారం, ప్రయోజనాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

బ్రస్సెల్స్ మొలకల్లో పోషణ
బ్రస్సెల్స్ మొలకల్లో ఉన్న పోషకాహారం గురించి చెప్పాలంటే డైటరీ ఫైబర్, కాల్షియం, ఫోలేట్, ఐరన్, విటమిన్ సి, బి 6, కె వంటి అనేక ఇతర పోషకాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువ కేలరీలు ఉండవు. అందుకే బ్రస్సెల్స్ మొలకలు బరువు తగ్గించే ఆహారంలో చేర్చబడ్డాయి. వీటిని సలాడ్‌గా తీసుకోవచ్చు లేదా ఆవిరిగా ఉడికించి తినవచ్చు. వీటిల్లో కొన్ని వస్తువులను కలిపి కూడా తినవచ్చు.

ఇవి కూడా చదవండి

కడుపు సంబంధిత సమస్యలలో ప్రయోజనం
డైటరీ ఫైబర్ బ్రస్సెల్స్ మొలకలలో కనిపిస్తుంది. అందువల్ల బ్రస్సెల్స్ మొలకలను తినే ఆహారంలో చేర్చుకోవడం వలన జీర్ణక్రియను మెరుగుపరచడంలో ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. బ్రస్సెల్స్ మొలకలను తీసుకోవడం వల్ల మలబద్ధకం, కడుపు వాపు, పేగు సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

చర్మానికి కూడా మేలు చేస్తుంది
బ్రస్సెల్స్ మొలకలు తీసుకోవడం వల్ల చర్మానికి కూడా మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, దెబ్బతిన్న కణాలను రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది కొల్లాజెన్‌ని పెంచుతుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.

వాపు లక్షణాలను తగ్గిస్తుంది
శరీరంలో మంట (శరీరంలోని ఏదైనా భాగంలో వాపు, శరీర ఉష్ణోగ్రత పెరుగుదల, నొప్పి, అలసట) ఒక సహజ ప్రక్రియ అయినప్పటికీ.. శరీరం సంక్రమణతో పోరాడటానికి ప్రయత్నిస్తుంది. అయితే కొన్నిసార్లు జాగ్రత్త తీసుకోకపోతే అనేక ఆరోగ్య సమస్యల బారిన పడవచ్చు. బ్రస్సెల్స్‌లో మంచి మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా మిమ్మల్ని మంట నుంచి రక్షిస్తాయి.

విటమిన్ కే మూలం బ్రస్సెల్స్ మొలకలు
విటమిన్ K మన శరీరంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వాస్తవానికి.. ఈ విటమిన్ రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది. గాయం అయినప్పుడు రక్తస్రావం ఆపడంలో సహాయపడుతుంది. బ్రస్సెల్స్ మొలకల్లో విటమిన్ కే అధికంగా లభిస్తుంది.

ఎముకలను బలంగా చేయడంలో సహాయపడుతుంది
బ్రస్సెల్స్ మొలకల్లో కూడా కాల్షియం అధిక మొత్తంలో ఉంటుంది. ఏ వయస్సులో అయినా సరే బ్రస్సెల్స్ మొలకలు ఎముకలను బలంగా ఉంచుతాయి. బోలు ఎముకల వ్యాధిని నివారిస్తాయి. ఎముక పగుళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..