Breast Milk for Eye Health: తల్లి పాలల్లో అద్భుత ఔషధ గుణాలు.. కంట్లో చిన్న చుక్క వేస్తే చాలు ఆ సమస్యలన్నీ పరార్!

ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ టీవీ, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చూడటం వల్ల కంటి ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోంది. అందువల్ల కంటి నొప్పి, వాపు మొదలైన సమస్యలు పెరుగుతున్నాయి. శరీరంలో టాక్సిన్స్ లేదా చెడు రక్తం అధిక స్థాయిలో ఉన్నప్పుడు కొంతమందికి కళ్ళు చీముతో నిండిపోతాయి. దీనివల్ల విపరీతమైన నొప్పి, వాపు..

Breast Milk for Eye Health: తల్లి పాలల్లో అద్భుత ఔషధ గుణాలు.. కంట్లో చిన్న చుక్క వేస్తే చాలు ఆ సమస్యలన్నీ పరార్!
Breast Milk For Eye Health

Updated on: May 06, 2025 | 8:56 PM

శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కన్ను ఒకటి. కానీ దాని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ టీవీ, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చూడటం వల్ల కంటి ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోంది. అందువల్ల కంటి నొప్పి, వాపు మొదలైన సమస్యలు పెరుగుతున్నాయి. శరీరంలో టాక్సిన్స్ లేదా చెడు రక్తం అధిక స్థాయిలో ఉన్నప్పుడు కొంతమందికి కళ్ళు చీముతో నిండిపోతాయి. దీనివల్ల విపరీతమైన నొప్పి, వాపు వస్తుంది. దీనినే కురు అంటారు. ఈ రకమైన కంటి సంబంధిత సమస్యలను నివారించడానికి రకరకాల ముందులు వాడుతుంటారు. వీటన్నింటికి బదులుగా కంటి సమస్యలను నివారించడానికి తల్లి పాలను ఉపయోగించవచ్చు. ఇది మీలో చాలా మందికి ఆశ్యర్యాన్ని కలిగించవచ్చు. కానీ అది నిజం. కాబట్టి తల్లిపాలు కంటి సమస్యలను ఎలా నివారిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

ఎక్కువ ఆసుపత్రులు, రవాణా సౌకర్యాలు లేని కాలంలో తలెత్తే ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి మన పూర్వికులు ఎక్కువగా ఇంటి నివారణలను ఆశ్రయించేవారు. అవి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఆరోగ్య సమస్యకు పరిష్కారాన్ని అందించేవి. కానీ ఇప్పుడు వివిధ రకాల మందులు సులభంగా అందుబాటులో వచ్చాయి. దీంతో ఎవరూ ఈ ఇంటి నివారణలను ఉపయోగించడం లేదు. ముఖ్యంగా తల్లి పాలలో కూడా అనేక ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

తల్లి పాలు బిడ్డకు అమృతం లాంటివి. కానీ ఇది పిల్లలకు మాత్రమే కాకుండా కొన్ని ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి కూడా ఉపయోగపడతాయి. దీని ఔషధ గుణాలు కంటి సమస్యలను తక్షణమే నయం చేసే శక్తిని కలిగి ఉంటాయి. కంటి నొప్పి, దురద, మంట, కన్ను ఎర్రబడటం, కంటి ఇన్ఫెక్షన్లు వంటి వివిధ కంటి సంబంధిత సమస్యలను నివారించడానికి తల్లి పాలను ఉపయోగించవచ్చు. వీటిని కంటిలోకి పోయడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కంటిలో ఐదు లేదా ఆరు చుక్కలు వేయడం వల్ల కంటి సమస్యలు తొలగిపోతాయి. అయితే ఈ ఇంటి నివారణను ప్రయత్నించే ముందు వైద్యుడిని సంప్రదించడం మాత్రం మర్చిపోకూడదు. ఇలా చేసిన తర్వాత కూడా కంటి నొప్పి లేదా మంట తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ఇవి కూడా చదవండి

గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.