Vitamin D deficiency: శరీరంలో విటమిన్ డీ లోపమా..! తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి..

వేసవి కాలంలో శరీరంలో విటమిన్ డి లోపం ఉండటం సర్వసాధారణం. ఎందుకంటే అవసరమైనప్పుడు మాత్రమే బయటకు వెళ్లడం, ఎక్కువసేపు ఎండకు దూరంగా ఉండడం వలన శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. అయితే ఈ విటమిన్ లోపం ఏర్పడితే చింతించాల్సిన పని లేదు. ఈ రోజు శరీరంలో విటమిన్ డి ని పెంచే కొన్ని రకాలైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏమిటంటే..

Vitamin D deficiency: శరీరంలో విటమిన్ డీ లోపమా..! తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి..
Boost Vitamin D

Updated on: May 17, 2025 | 12:15 PM

మన శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి కాల్షియం, మెగ్నీషియం, జింక్, అయాన్లు, విటమిన్లు, ఖనిజాలు వంటి అనేక పోషకాలు అవసరం. వీటిల్లో ఒకటి విటమిన్ డి. ఇది మన ఎముకలను బలోపేతం చేయడానికి చాలా ముఖ్యమైనది. నిజానికి మనం ఈ విటమిన్‌ను సూర్యకాంతి నుంచి సహజంగా లభిస్తుంది. అయితే వేసవి కాలంలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది.. ఈ నేపధ్యంలో బయటకు వెళ్లడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. కనుక వేసవిలో శరీరంలో విటమిన్ డి లోపం రాకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్ధాలను తినే వాటిల్లో చేర్చుకోవాలి.

వేసవిలో కూడా శరీరంలో విటమిన్ డి లోపాన్ని నివారించడానికి తినే ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చుకోవచ్చు. మాంసాహారులకు శరీరంలో విటమిన్ డి ని పెంచుకోవడానికి అనేక ఎంపికలు ఉన్నాయి. అయితే శాఖాహారులకు విటమిన్ డి పెంచుకోవడానికి కొన్ని ఆహార పదార్ధాలు మాత్రమే ఉన్నాయి.

విటమిన్ డి ఎందుకు ముఖ్యమైనదంటే

మన శరీరానికి అవసరమైన విటమిన్లలో విటమిన్ డి ఒకటి. ఇది శరీరంలోని రక్తం, ఎముకలలో కాల్షియం సమతుల్యతను కాపాడడానికి సహాయపడుతుంది. ఎముకలను నిర్మించడానికి, సంరక్షణ చేయడానికి సహాయపడుతుంది. విటమిన్ డి లోపం వల్ల కీళ్ల నొప్పులు, కండరాల బలహీనత, తిమ్మిర్లు, అలసట వంటి సమస్యలు ఏర్పడతాయి.

ఇవి కూడా చదవండి

విటమిన్ డి కోసం తినాల్సిన ఆహార పదార్ధాలు ఏమిటంటే

చేపలు: సాల్మన్, మాకేరెల్ , సార్డిన్స్ వంటి కొవ్వు చేపలు విటమిన్ డి కి పవర్‌హౌస్‌లు. వీటిని గ్రిల్ చేసి రాత్రి భోజనంలో తినవచ్చు లేదా సార్డిన్స్ చేపలను సలాడ్‌గా, మాకేరెల్ చేపలను డిప్‌గా తినవచ్చు. ఈ మూడు విటమిన్ డి, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు మంచి వనరులు.

పుట్టగొడుగులు: శాకాహారులకు పుట్టగొడుగులు ఒక వరం వంటివి. ఇందులో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఈ పుట్టగొడుగులతో కూరలు, పిజ్జా లేదా శాండ్‌విచ్‌లో చేర్చడం ద్వారా తినవచ్చు. 100 గ్రాముల పుట్టగొడుగులో 7 అంతర్జాతీయ యూనిట్ల విటమిన్ డి ఉంటుంది. కనుక ఈ పుట్టగొడుగులను తినడం ద్వారా శరీరంలో విటమిన్ డి లోపం తొలగిపోతుంది.

గుడ్లు: గుడ్లలో ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అయితే గుడ్డులో కూడా విటమిన్ డి అధికంగా ఉంటుంది. ఒక గుడ్డులో 44 అంతర్జాతీయ యూనిట్ల విటమిన్ డి ఉంటుంది. ఇది అల్పాహారానికి మంచి ఎంపిక. తినే ఆహారంలో గుడ్లను అనేక విధాలుగా చేర్చుకోవచ్చు. దీనిని ఆమ్లెట్ లేదా గుడ్డు కర్రీ రూపంలో తినవచ్చు. ఇలా చేయడం వలన శరీరంలో విటమిన్ డి లోపం ఉండదు.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)