Black Diamond Apple: ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లాక్ డైమండ్ ఆపిల్.. దీని ధర ఎంతో తెలిస్తే షాక్..

|

May 29, 2022 | 1:17 PM

ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆపిల్స్ లో 7,500 పైగా రకాలు ఉన్నాయని.. వాటిల్లో బ్లాక్ యాపిల్ కూడా ఒకటిని మీకు తెలుసా.. ఈ బ్లాక్ డైమండ్ యాపిల్ టిబెట్ లోని మారుమూల ప్రాంతంలో లభిస్తాయి.

Black Diamond Apple: ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లాక్ డైమండ్ ఆపిల్.. దీని ధర ఎంతో తెలిస్తే షాక్..
Black Diamond Apple
Follow us on

Black Diamond Apple: రోజూ ఒక ఆపిల్ తినండి.. ఆరోగ్యంగా ఉండండి.. శీతాకాలంలో లభించే ఈ ఆపిల్ ను తలచుకోగానే ఎర్రగా గుండ్రంగా అందంగా కనిపించే ఆపిల్ గుర్తుకొస్తుంది. ఇప్పుడిప్పుడే గ్రీన్ ఆపిల్ కూడా మార్కెట్ లో విస్తృతంగా లభిస్తున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆపిల్స్ లో 7,500 పైగా రకాలు ఉన్నాయని.. వాటిల్లో బ్లాక్ యాపిల్ కూడా ఒకటిని మీకు తెలుసా.. ఈ బ్లాక్ డైమండ్ యాపిల్ టిబెట్ లోని మారుమూల ప్రాంతంలో లభిస్తాయి. ఈరోజు ఈ బ్లాక్ డైమండ్ యాపిల్ గురించి తెలుసుకుందాం..

బ్లాక్ డైమండ్ యాపిల్స్ ని చైనా వారు రెడ్ డెలిషియస్ ఆపిల్ అని కూడా పిలుస్తారు. ఇవి అరుదైన కుటుంబానికి చెందిన పండు. అయితే పేరుకే బ్లాక్ డైమండ్ యాపిల్స్ కానీ ఈ పండ్లు నల్లగా ఉండవు. ఊదా ముదురు రంగులో ఉంటాయి. ఈ ప్రత్యేకమైన యాపిల్స్ టిబెట్ పర్వతాలోని ఒక చిన్న నగరమైన న్యింగ్‌చి జన్మ స్థలం. ఈ ప్రాంతంలో పగటి పూట  అతినీలలోహిత కాంతి ప్రసారమవుతుంది. అయితే రాత్రి సమయంలో ఉష్ణోగ్రత అనూహ్యంగా హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఈ అసాధారణ వాతావరణ పరిస్థితుల వలన ఆపిల్న పై చర్మం రంగు ఉదా రంగులోకి  మారుతుంది. అయితే లోపల ఉన్న  పదార్ధం నార్మల్ యాపిల్ లాగా తెల్లగా ప్రకాశవంతంగా ఉంటుంది.

ఈ యాపిల్స్ టిబెట్, చైనాలతో పాటు యుఎస్ లో కూడా కనిపిస్తాయి. కానీ వీటిని ఎక్కువగా పండించడానికి రైతులు ఇష్టపడరు. ఎందుకంటే చెట్టు నుంచి పండ్లు పొందడానికి ఐదు నుండి ఎనిమిది సంవత్సరాలు పడుతుంది. అంతేకాదు పండు రుచిగా మారడానికి కూడా ఎక్కువ సమయం నిల్వ చేయాల్సి ఉంటుంది. కనుక లాభసాటి కాదని ఈ బ్లాక్ డైమండ్ యాపిల్ ను పండించడానికి పెద్దగా ఆసక్తిని చూపించడం లేదని తెలుస్తోంది.  సాధారణంగా ప్రతి సంవత్సరం కేవలం రెండు నెలలు మాత్రమే ఈ యాపిల్స్ అందుబాటులో ఉంటాయి.

ఈ బ్లాక్ డైమండ్ యాపిల్స్ మంచి రుచి కలిగినప్పటికీ మనకు మార్కెట్ లో లభిస్తున్న సాధారణ యాపిల్స్ లో ఉన్నన్ని పోషకాలు ఉండవని తెలుస్తోంది. ఈ అందమైన ఆపిల్‌లు ఖరీదైనవి. బ్లాక్ డైమండ్ యాపిల్స్ తక్కువగా పండిస్తారు. చైనాలో హై-ఎండ్ సూపర్ మార్కెట్‌లలో (గిఫ్ట్ బాక్స్‌లలో) మాత్రమే విక్రయిస్తారు.  ఈ బ్లాక్ డైమండ్ యాపిల్ ధర ఒకొక్కటి మన దేశ కరెన్సీలో రూ. 500 లు ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..