Nail Biting
కొంతమందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. దీని వల్ల ఎన్నో అనర్ధాలు ఉన్నాయని నిపుణులు చెబుతన్నారు. కొందరు స్ట్రస్, ఆందోళన వంటి కారణాల వల్ల కూడా గోర్లు కొరకుతూ ఉంటారు. గోర్లు కొరకడం వల్ల వాటి చుట్టూరా ఉన్న చర్మం దెబ్బతింటుంది. అదే విధంగా గోర్లు పెరిగేలా చేసే కణజాలాన్ని దెబ్బతీస్తుంది. ఈ అలవాటును దీర్ఘకాలికంగా కొనసాగిస్తే.. గోర్లలో పేరుకుపోయిన హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు శరీరంలోకి చొచ్చుకువెళ్తాయి. తద్వారా మీరు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉంది.
గోర్లు కొరకడం ఆపడానికి ఈ మార్గాలను ప్రయత్నించండి
- – మీ గోళ్లను చిన్నగా కత్తిరించండి. ఇది గోర్లు కొరికే టెంప్టేషన్‌ను కూడా తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన గోరు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
- –గోర్లు కొరకాలనిపించినప్పుడు చూయింగ్ గమ్ నమలండి. లేదా ఆ సమయంలో కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, యాలకులు వంటివి తినండి
- – గోళ్లు కొరకడాన్ని శారీరకంగా నిరోధించడానికి మీ చేతులకు గ్లౌజులు ధరించడం లేదా వేలికొనలకు బ్యాండేజీలను ఉపయోగించడం మంచి పద్దతి
- – స్ట్రెస్ బాల్స్ వినియోగించే పనుల్లో మీ చేతులను నిమగ్నం చేయండి.
- – చేదు రుచి గల నెయిల్ పాలిష్‌ని మీ గోళ్లకు రాయండి. దీంతో నెమ్మదిగా గోళ్లు కొరికే అలవాటు తగ్గుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..