నిద్ర ఆరోగ్యానికి ఎంతో కీలకం. మనం నిద్రపోయే స్థలం, దిశ మన శరీరానికి, మనస్సుకు ప్రభావం చూపుతాయి. వాస్తు ప్రకారం సరైన దిశలో నిద్రిస్తే శరీరంలో సానుకూల శక్తి పెరుగుతుంది. ఆరోగ్యం, మానసిక శాంతి లభిస్తాయి. కానీ తప్పు దిశలో నిద్రిస్తే ఒత్తిడి, అలసట, అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వాస్తు ప్రకారం ఏ దిశలో నిద్రపోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
దక్షిణ దిశ వైపు తల పెట్టుకుని నిద్రపోవడం వాస్తు ప్రకారం అత్యంత ఉత్తమం. భూమి అయస్కాంత శక్తితో సమతుల్యత సాధించడంతో పాటు నిద్ర నాణ్యత మెరుగవుతుంది. దీని వల్ల శరీరం ఉత్తేజంగా ఉంటుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆరోగ్య పరంగా కూడా ఇది చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
తూర్పు దిశలో నిద్రించడం విద్యార్థులు, బుద్ధిజీవులకు అత్యంత అనుకూలం. ఈ దిశ బుద్ధి వికాసానికి తోడ్పడుతుంది. నిద్ర సరిగ్గా పట్టి, కొత్త విషయాలు సులభంగా అర్థం చేసుకునేలా చేస్తుంది. విజయం, సంపద, మంచిపేరు కావాలనుకునేవారు ఈ దిశలో నిద్రిస్తే మేలు జరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఈ దిశలో నిద్రించడం ద్వారా మితమైన ఫలితాలు లభిస్తాయి. తూర్పు లేదా దక్షిణం దిశలతో పోలిస్తే ఇది అంతగా ప్రయోజనకరం కాదు. కానీ ఈ దిశ స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఎవరైనా స్థిరమైన జీవితం కోరుకుంటే పడమర వైపు తల పెట్టుకుని నిద్రించవచ్చు.
వాస్తు ప్రకారం ఉత్తర దిశలో నిద్రించడం అనుకూలం కాదు. ఈ దిశలో నిద్రిస్తే ఒత్తిడి పెరుగుతుంది. నిద్ర సరిగ్గా పట్టదు. ఇది ముఖ్యంగా వృద్ధులకు మంచిది కాదు. ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఉత్తర దిశలో నిద్రించకూడదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సరైన దిశలో నిద్రించడం వల్ల జీవనశైలి మెరుగుపడుతుంది. వాస్తు నియమాలను పాటించడం వల్ల ఆరోగ్యం, సంపద, మానసిక ప్రశాంతత పొందొచ్చు. కాబట్టి మీరు నిద్రించే దిశను సరిచూసుకొని శ్రేయస్సును పొందండి.