Kitchen Hacks: దోమల్ని ఇంట్లోంచి తరి మేసేందుకు బెస్ట్ చిట్కాలు మీకోసం..

వర్షాకాలం కారణంగా వాతావరణం అంతా తడి తడిగా ఉంటుంది. ఈ తడి కారణంగా అనేక వ్యాధులు ప్రభలే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే వర్షా కాలాన్ని వ్యాధుల కాలం అని కూడా పిలుస్తారు. ఈ కాలంలోనే ఎక్కువగా జబ్బు పడాల్సి వస్తుంది. గాలిలో వైరస్, బ్యాక్టీరియా పెరిగిపోవడం కారణంగా సీజనల్ వ్యాధులు కూడా ఎటాక్ చేస్తాయి. అంతేకాకుండా ముఖ్యంగా దోమల కారణంగా కూడా రోగాలు వచ్చే..

Kitchen Hacks: దోమల్ని ఇంట్లోంచి తరి మేసేందుకు బెస్ట్ చిట్కాలు మీకోసం..
Mosquitoes
Follow us

|

Updated on: Jul 01, 2024 | 3:43 PM

వర్షాకాలం కారణంగా వాతావరణం అంతా తడి తడిగా ఉంటుంది. ఈ తడి కారణంగా అనేక వ్యాధులు ప్రభలే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే వర్షా కాలాన్ని వ్యాధుల కాలం అని కూడా పిలుస్తారు. ఈ కాలంలోనే ఎక్కువగా జబ్బు పడాల్సి వస్తుంది. గాలిలో వైరస్, బ్యాక్టీరియా పెరిగిపోవడం కారణంగా సీజనల్ వ్యాధులు కూడా ఎటాక్ చేస్తాయి. అంతేకాకుండా ముఖ్యంగా దోమల కారణంగా కూడా రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలంలో చాలా చోట్ల నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు ఎక్కువై.. చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి ప్రమాదకర వ్యాధులు వస్తాయి. దోమల్ని ఇంట్లోంచి తరి మేసేందుకు ఇప్పటికే చాలా చిట్కాలు తెలుసుకున్నాం. మళ్లీ మీ కోసం మరో సింపుల్ అండ్ ఎఫెక్టివ్ చిట్కాలను తీసుకువచ్చాం. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

దోమలు కుట్టకుండా..

దోమల నుంచి మీకు మంచి రిలీఫ్ ఇవ్వడంలో కర్పూరం ఎంతో చక్కగా సహాయ పడుతుంది. కర్పూరాన్ని మెత్తగా చేసుకుని, కొబ్బరి నూనె లేదా వేప నూనెలో కలిపి.. బాడీకి రాసుకోవడం వల్ల దోమలు కుట్టవు. చిన్న పిల్లలకు ఈ ట్రిక్ ఎంతో చక్కగా పని చేస్తుంది. ఎందుకంటే కర్పూరం, వేప నూనెలో ఎక్కువగా ఘాటు వాసన అనేది ఉంటుంది. ఈ వాసన కారణంగా దోమలు దగ్గరగా రావు. అంతే కాకుండా జలుబు, దగ్గు వంటివి కూడా తగ్గుతాయి.

ఇలా చేస్తే ఇంట్లోకి రావు..

దోమలను ఇంట్లోంచి వెళ్లగొట్టడానికి కర్పూరం, యాపిల్ సైడర్ వెనిగర్ చక్కగా పని చేస్తాయి. కర్పూరాన్ని పొడిలా చేసుకోవాలి. అందులోకి యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి. అందుకు సమాన పరిమాణంలో నీటిని కలపండి. ఇవి మొత్తం బాగా కలిపి.. స్ప్రే బాటిల్‌లో వేసుకోండి. దీన్ని తలుపులు, కిటికీలు, మొక్కల కింద భాగాల్లో వాష్ ఏరియాల్లో స్ప్రే చేయండి. ఈ స్ప్రే ఘాటు వాసనకు దోమలు పారిపోతాయి. వెల్లుల్లి నీటిని కూడా స్ప్రే చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

చర్మానికి లోషన్‌గా..

దోమల కుట్టడం వల్లనే వ్యాధులు అనేవి వస్తాయి. దోమలు కుట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. మార్కెట్లో ఉండే కెమికల్ క్రీమ్స్ కంటే.. ఇంట్లోనే నేచురల్‌గా లోషన్ తయారు చేసుకోవచ్చు. వేప నూనె, యూకలిప్టస్ ఆయిల్, లెమన్ గ్రాస్ ఆయిల్‌ని సమాన భాగాలుగా తీసుకుని కలపండి. దీన్ని చర్మంపై అప్లై చేస్తే.. దోమలు కుట్టకుండా ఉంటాయి. పిల్లలకు కూడా ఈ ఆయిల్ రాయవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..