జామలో విటమిన్ సి , లైకోపీన్ యాంటీ యాక్సీడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది వ్యాధి నిరోధక శక్తి పెరగడంలో ఉపయోగపడుతుంది. తరచూ వచ్చే వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.
క్యాన్సర్ మహమ్మారిని తరమికొట్టడంలో కూడా జామ పండు ఉపయోగపడుతుంది. ఇందులోని మెగ్నీషియం, యాంటీ యాక్సిడెంట్స్ ప్రీరాడికల్స్‌ను బయటకు పంపడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
అధిక రక్తపోటుతో బాధపడే వారికి జామ పండ్లు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఇందులోని ఫైబర్ సోడియం, పొటాషియం నిల్వలను సమన్వయ పరిచి రక్త పోటును అదుపులో ఉంచుతాయి.
జీర్ణ సంబంధిత సమస్యలు దూరం చేయడంలో జామ కాయ కూడా దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణ ప్రక్రియను సక్రమంగా సాగేలా చేస్తుంది.
కంటి చూపు మెరుగుపరచడంలో కూడా జామపండు క్రియాశీలకంగా పనిచేస్తుంది. ఇందులోని విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది.
ఇక జామపండులో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తుంది. ఇది గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. తల్లితో పాటు, గర్భంలోని శిశువుకు కూడా ఇది మేలు చేస్తుంది.
జామపండు తియ్యగా ఉన్నా మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్, తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది, దీని కారణంగా డయాబెటిక్ రోగులు కూడా దీనిని తినవచ్చు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.