రక్తపోటుతో బాధపడే వారికి కివి బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. కివిలో ఉండే పొటాషియం కంటెంట్ రక్తపోటును అదుపులో ఉంచడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
కివీ విటమిన్ సి కి పెట్టింది పేరు. ఇందులోని ఈ విటమిన్ చర్మాన్ని ఆరోగ్యంగా, నాజూకుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం పాలిపోకుండా చేస్తుంది.
కివిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ప్రతీ 100 గ్రాముల కివీలో 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
కివీ పండులో సెరటోనిన్ పుష్కలంగా ఉంటుంది. తరచూ కివీ పండును తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టొచ్చు. రోజు పడుకునే ముందు తీసుకుంటే మంచి నిద్ర సొంతమవుతుంది.
కివీలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ క్రమబద్ధీకరణకు తోడ్పడుతాయి.
ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో కివీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని ఫోలేట్ ఎముక నిర్మాణాన్ని తోడ్పడుతుంది. గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది.
క్యాన్సర్ కారకాలకు చెక్ పెట్టడంలో కివీ ఉపయోగపడుతుంది. కేన్సర్ కు కారణమయ్యే జన్యుపరమైన కారకాలను నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్‌ను తరిమికొడుతుంది.
పైన తెలిపిన విషాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.