దేశంలోని పరిశుభ్రమైన నది ఎదో తెలుసా..?
TV9 Telugu
03 July 2024
మనం ఏదైనా నది గురించి మాట్లాడేటప్పుడు, దాని పరిశుభ్రత గురించి ఖచ్చితంగా ప్రస్తావన ఉంటుంది. దేశంలో గాజులా కనిపించే ఒక నది ఉంది.
ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో ఈ నదిలో అడుగున ఉండే రాళ్లను సులభంగా చూడగలిగేంత శుభ్రంగా ఉన్న నది ఉంది.
మేఘాలయలోని ఉమ్‌గోట్ నది భారతదేశంలోని పరిశుభ్రమైన నదిగా పరిగణిస్తారు. దాని మీద ప్రయాణించే పడవలు గాలిలో తేలియాడుతున్నట్లుగా కనిపిస్తాయి.
ఉమ్‌గోట్ నదిని డౌకి అని కూడా అంటారు. డౌకి భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న ఒక చిన్న పట్టణం.
ఉమ్‌గోట్ నది షిల్లాంగ్‌కు తూర్పున 95 కి.మీ దూరంలో ఉన్న జైంతియా హిల్స్ జిల్లాలోని దాకీ పట్టణం గుండా ప్రవహిస్తుంది.
ఇక్కడ నివసించే గిరిజన వర్గాల పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాలే ఈ పరిశుభ్రతకు కారణమని చెబుతున్నారు.
ఇది ప్రవహించే గ్రామాల ప్రజలు దాని పరిశుభ్రతను చూసుకుంటారు. వివిధ సంఘాలకు చెందిన పెద్దలు పర్యవేక్షిస్తున్నారు.
ఇది భారతదేశం బాంగ్లాదేశ్ హద్దు ప్రాంతంలో ఉంది. ఇక్కడ స్వర్గాన్ని తలపించే ప్రకృతి అందాలు వీక్షకులను కట్టిపడేస్తాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి