గోండ్ కటిరా,పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?

Jyothi Gadda

03 July 2024

పెరుగు, గోండ్ కటిరా ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. అయితే ఈ రెండు పదార్థాలను కలిపి తింటే ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మీరు బరువు తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నట్లయితే పెరుగుతో కలిపిన గోండ్‌కటిరా తినడం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేయడం వల్ల చాలా సేపు మీ పొట్ట నిండుగా ఉంటుంది. త్వరగా ఆకలివేయదు. 

సరైన ఆహారం తీసుకోవడం వల్ల చిన్న వయస్సులోనే ఎముకలు బలహీనపడతాయి. అటువంటి పరిస్థితిలో పెరుగుతో గోండ్‌ కటిరా కలిపి తినడం వల్ల ఎముకలకు మంచి బలాన్నిస్తుంది. 

ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత శరీరంలోని అనేక భాగాలలో వాచినట్టుగా ఉందని చాలా మంది ఫిర్యాదు చేస్తారు. అటువంటి పరిస్థితిలో పెరుగుతో కలిపిన గోండ్‌ కటిరా తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.

గోండ్ కటిరా కూడా చాలా వరకు ఒత్తిడిని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని తినడం ద్వారా మీరు రిలాక్స్‌గా, రిఫ్రెష్‌గా ఉంటారు. 

పెరుగుతో కలిపి గోండ్ కటిరా తినడం వల్ల మీ శరీరం రిలాక్స్‌గా ఉంటుంది. ఇది మీకు మంచి నిద్రకు తోడ్పడుతుంది. ప్రశాంతమైన నిద్ర అన్ని రకాల అనారోగ్య సమస్యలకు పరిష్కారంగా పనిచేస్తుంది. 

పేలవమైన ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి, మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి మీరు పెరుగుతో గోండ్‌ కటిరా తినాలి.

గోండ్ కటిరాలో ప్రోటీన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులో ఉంటాయి. ఎండాకాలంలోనే కాకుండా చలికాలంలోనూ గోండ్‌ కటిర లడ్డూలు తింటారు కొందరు.