స్కాలర్‌షిప్‌ కోసం తండ్రి మరణించాడని నకిలీ సర్టిఫికెట్‌.. ఆ తర్వాత ఏమైంది ??

స్కాలర్‌షిప్‌ కోసం తండ్రి మరణించాడని నకిలీ సర్టిఫికెట్‌.. ఆ తర్వాత ఏమైంది ??

Phani CH

|

Updated on: Jul 03, 2024 | 12:57 PM

స్కాలర్‌షిప్‌ కోసం బతికున్న తండ్రి చనిపోయినట్టు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి యూనివర్సిటీకి సమర్పించిన భారత్‌కు చెందిన ఒక విద్యార్థిని అమెరికా పోలీసులు అరెస్ట్‌ చేశారు. 19 ఏళ్ల ఆర్యన్‌ ఆనంద్‌ గత ఏడాది నకిలీ సర్టిఫికెట్లతో లెహీ వర్సిటీలో ప్రవేశం పొందాడు. స్కాలర్‌ షిప్‌ కోసం తన తండ్రి బతికి ఉన్నప్పటికీ మరణించినట్టు డెత్‌ సర్టిఫికెట్‌ సమర్పించాడు.

స్కాలర్‌షిప్‌ కోసం బతికున్న తండ్రి చనిపోయినట్టు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి యూనివర్సిటీకి సమర్పించిన భారత్‌కు చెందిన ఒక విద్యార్థిని అమెరికా పోలీసులు అరెస్ట్‌ చేశారు. 19 ఏళ్ల ఆర్యన్‌ ఆనంద్‌ గత ఏడాది నకిలీ సర్టిఫికెట్లతో లెహీ వర్సిటీలో ప్రవేశం పొందాడు. స్కాలర్‌ షిప్‌ కోసం తన తండ్రి బతికి ఉన్నప్పటికీ మరణించినట్టు డెత్‌ సర్టిఫికెట్‌ సమర్పించాడు. అయితే నకిలీ సర్టిఫికెట్‌లతో అమెరికా వర్సిటీలో ఎలా సీటు తెచ్చుకుంది.. తన తండ్రి చనిపోయాడని అబద్ధం చెప్పి స్కాలర్‌షిప్‌ తెచ్చుకున్న వైనాలన్నీ వివరిస్తూ ‘అబద్ధాలతోనే నా జీవితం, కెరీర్‌ను నిర్మించుకున్నా’ పేరుతో రెడ్డిట్‌లో అతడు చేసిన పోస్టే అతడిని పట్టించింది. దీంతో ఏప్రిల్‌ 30న ఆనంద్‌ను అరెస్ట్‌ చేశారు. అతనిపై ఆరోపణలకు జీవితకాల శిక్ష పడుతుంది. అయితే అతడు నార్తంప్టన్‌ కౌంటీ జైలులో ఒకట్రెండు నెలల శిక్ష అనుభవించిన తర్వాత క్షమాభిక్ష పెట్టి స్వదేశానికి పంపనున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇన్‌స్టాలో విరిగిన పన్ను చూసి సోదరుడిని గుర్తుపట్టిన మహిళ

ఐస్‌క్రీంలో మనిషి చేతి వేలు.. మిస్టరీని ఛేదించిన పోలీసులు

Airtel: ఎయిర్‌టెల్ ప్రీ పెయిడ్, పోస్ట్‌ పెయిడ్ ధరల పెంపు

సొరకాయా.. మజాకా !! బోలెడన్ని ప్రయోజనాలు

Harom Hara: ఘట్టమనేని అభిమానులకు గుడ్ న్యూస్.. OTTలోకి వస్తోన్న హరోం హర