పకృతి అంటే ఇష్టమా..! ఈ సీజన్ లో ముంబైకి సమీపంలో అందమైన ప్రదేశాల్లో పర్యటించండి.. బెస్ట్ అనుభూతి మీ సొంతం..

|

Jul 19, 2024 | 12:19 PM

ఈ సీజన్‌లో ఈ కొండ ప్రాంతాలకు వెళ్ళడం ఓ విధంగా ప్రమాదకరం అని చెప్పవచ్చు. కనుక వర్షం కురుస్తుంటే ప్రకృతి అందాలను చూడాలనుకుంటే దేశ ఆర్ధిక రాజధాని ముంబై బెస్ట్ అని చెప్పవచ్చు. వర్షాకాలంలో ముంబైలోని కొన్ని ప్రదేశాలను అన్వేషించవచ్చు. ముంబైలోని లోన్‌వాలా పర్యాటకులలో ప్రసిద్ధి చెందినప్పటికీ..దీనితో పాటు జీవితంలో ఒక్కసారైనా చూడాలి అనుకునే అనేక ఇతర ప్రదేశాలు ఉన్నాయి.

పకృతి అంటే ఇష్టమా..! ఈ సీజన్ లో ముంబైకి సమీపంలో అందమైన ప్రదేశాల్లో పర్యటించండి.. బెస్ట్ అనుభూతి మీ సొంతం..
Monsoon Season Travel Tips
Image Credit source: Paramantapa Dasgupta/Moment/Getty Images
Follow us on

వర్షాకాలం రాగానే టీ, పకోడీలు తినడంతో పాటు ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. ఈ సీజన్‌లో ప్రకృతి అందాలు రెట్టింపు అవుతాయి. అటువంటి పరిస్థితిలో ప్రయాణం చేయడానికి ఇదే మంచి సీజన్. ఎందుకంటే వర్షాకాలంలో ఎండ, వేడి, విపరీతమైన ఉష్ణోగ్రతలు ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఈ సీజన్‌లో చాలా కొండ ప్రాంతాల్లో రోడ్లను మూసివేస్తారు. అందుకనే చాలా మంది సిమ్లా, మనాలి వంటి ప్రదేశాలకు వెళ్ళడం గురించి ఆలోచిస్తారు. అయితే ఈ సీజన్‌లో ఈ కొండ ప్రాంతాలకు వెళ్ళడం ఓ విధంగా ప్రమాదకరం అని చెప్పవచ్చు. కనుక వర్షం కురుస్తుంటే ప్రకృతి అందాలను చూడాలనుకుంటే దేశ ఆర్ధిక రాజధాని ముంబై బెస్ట్ అని చెప్పవచ్చు. వర్షాకాలంలో ముంబైలోని కొన్ని ప్రదేశాలను అన్వేషించవచ్చు. ముంబైలోని లోన్‌వాలా పర్యాటకులలో ప్రసిద్ధి చెందినప్పటికీ..దీనితో పాటు జీవితంలో ఒక్కసారైనా చూడాలి అనుకునే అనేక ఇతర ప్రదేశాలు ఉన్నాయి.

ముంబై కలల నగరం అని చెబుతారు. సందర్శన పరంగా ఈ ప్రదేశం ఇతర పర్యాటక ప్రదేశాల కంటే తక్కువ కాదు. ఈ ప్రదేశం అందం మొదటి చూపులోనే మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఈ వర్షాకాలంలో, ముంబైలోని కొన్ని ప్రదేశాలను తప్పనిసరిగా సందర్శించాలి. వీటిని సందర్శించడం వలన మనసు ప్రసాంతంగా ఉంటుంది. రీచార్జ్ అయిన ఫీలింగ్ ని ఇస్తుంది.

తపోల: వర్షాకాలంలో సందర్శించడానికి తపోలా మహారాష్ట్రలోని ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. దీని అందం కారణంగా దీనిని పశ్చిమ కాశ్మీర్ అని కూడా పిలుస్తారు. ఇది ముంబై నుంచి 300 కిలోమీటర్ల దూరంలో.. పూణే నుండి కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది శివసాగర్ సరస్సు సమీపంలో విస్తరించి ఉన్న చాలా అందమైన హిల్ స్టేషన్. ఇక్కడ ట్రెక్కింగ్ కూడా ఆనందించవచ్చు.

ఇవి కూడా చదవండి

భీమశంకరం: ఆధ్యాత్మికత ప్రదేశం భీమశంకరం.అయినప్పటికీ ఇక్కడ అందమైన జలపాతం, వన్యప్రాణుల అభయారణ్యం కూడా చూడవచ్చు. వర్షాకాలంలో ఇక్కడి దృశ్యం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ మీరు షిడీ ఘాట్ నుండి గణేష్ ఘాట్ వరకు ట్రెక్కింగ్ చేయవచ్చు.

మాథెరన్: నగరం జీవితం నుంచి ఉరుకులు పరుగులకు దూరంగా కొన్ని ప్రశాంతమైన క్షణాలను గడపాలని కోరుకుంటే.. ఖచ్చితంగా ఈ వర్షాకాలంలో మాథేరన్‌ను అన్వేషించాలి. ఇక్కడ మీరు ప్రకృతిని చాలా దగ్గరగా చూడవచ్చు. ఈ అందమైన ప్రదేశం ముంబైకి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. వర్షాకాలంలో ఇక్కడి దృశ్యం మొదటి చూపులోనే మిమ్మల్ని ఆకర్షిస్తుంది.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..