Winter Cooking Oils: చలికాలంలో ఆరోగ్యానికి, వంట చేసుకోవడానికి.. ఏ నూనె మంచిది!
చలికాలంలో శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచడం, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం చాలా ముఖ్యం. ఇందుకోసం మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, ఆహారం కోసం ఉపయోగించేందుకు మంచి నూనెను ఎంచుకోవడం ముఖ్యం. కాబట్టి చలికాలంలో మనం ఆరోగ్యంగా ఉండేందుకు వంటలో వాడేందుకు ఏ నూనె అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం.
Updated on: Dec 10, 2025 | 9:14 PM

ఆవ నూనె : ఆవ నూనెలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బులకు సంబంధించిన సమస్యల నుండి రక్షిస్తాయి. అలాగే రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. శరీరంలో చలిని తగ్గించి, వేడిని పెంచుతాయి. ఇది శీతాకాలంలో జుట్టు రాలడం, చర్మం నల్లబడటం వంటి సమస్యలకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే, ఒకే నూనెను పదే పదే వేడి చేయడం ఆరోగ్యానికి హానికరం.

నువ్వుల నూనె: ఆయుర్వేదంలో దీన్ని శీతాకాలపు నూనె' అని పిలుస్తారు. ఎందుకంటే నువ్వుల నూనె శరీరానికి లోపలి నుండి వెచ్చగా ఉంచుతుంది. ఇది కీళ్ల నొప్పులు, దృఢత్వం, వెన్నునొప్పి వంటి సమస్యలకు సహజ పరిష్కారాన్ని అందిస్తుంది. ఈ నూనేతో మసాజ్ చేసుకోవడం ద్వారా రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే ఇందులో ఉండే కాల్షియం, జింక్, మెగ్నీషియం ఎముకలను బలంగా ఉంచుతాయి. ముఖ్యంగా శీతాకాలంలో చర్మం పొడిబారడాన్ని తగ్గించడంలో ఈ నూనె చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

వేరుశెనగ నూనె: చలికాలంలో వంటకోసం ఈ నూనె ఉపయోగించడం చాలా మంచిది. ఎందుకంటే ఇది శరీరానికి అవసరమైన శక్తిని అందించడమే కాకుండా, శరీరాన్ని లోపల వెచ్చగా ఉంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ, ప్రోటీన్, కొవ్వులు గుండె ఆరోగ్యానికి దోహదపడుతాయి. అలాగే దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. అయితే, వేరుశెనగ అలెర్జీ ఉన్నవారు ఈ నూనెకు దూరంగా ఉండాలి.

శీతాకాలంలో మీరు ఏ నూనె వాడాలి? అది మీ శరీర అవసరాలు, ఆరోగ్య స్థితిని బట్టి ఉంటుంది. మీకు ఏవైనా గుండె సమస్యలు ఉంటే, ఆవ నూనె వాడటం మంచిది. మీకు పొడి చర్మం లేదా కీళ్ల నొప్పులు ఉంటే, నువ్వుల నూనె చాలా మంచిది. ఈ నూనెలతో ఇంట్లో బజ్జీ, మురుక్కు, పరాఠా వంటి వేయించిన ఆహారాలను వండటం మంచిది.

మొత్తం మీద, ఈ మూడు నూనెలను సమతుల్య పద్ధతిలో ఉపయోగించడం వల్ల శీతాకాలంలో శరీరానికి మొత్తం ఆరోగ్యం లభిస్తుంది.( పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహ మేరకు మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించలేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించ వచ్చు)




