LifeStyle: మొటిమలు మచ్చలుగా మారాయా.? ఈ నేచురల్‌ టిప్స్‌తో చెక్‌ పెట్టొచ్చు..

దీంతో చాలా మంది మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్‌లను ఉపయోగించి, మచ్చలను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే కెమికల్స్‌తో తయారు చేసే ఇలాంటి క్రీమ్‌లను ఉపయోగించడం వల్ల కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉంటాయి. ఇలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ బారిన పడకూడదంటే కొన్ని నేచురల్‌ పద్ధతుల్లో మొటిమల ద్వారా అయిన మచ్చలకు చెక్‌ పెట్టొచ్చు. ఇలా ఇంట్లోనే లభించే వస్తువులతో కొన్ని నేచురల్‌...

LifeStyle: మొటిమలు మచ్చలుగా మారాయా.? ఈ నేచురల్‌ టిప్స్‌తో చెక్‌ పెట్టొచ్చు..
Face Packs

Updated on: Dec 11, 2023 | 7:42 PM

మొహంపై మొటిమలు రావడం సర్వసాధారణమైన విషయం. మారిన ఆహారపు అలవాట్లు, వాయు కాలుష్యం, మద్యపానం కారణంగా మొటిమలు సమస్యలు వెంటాడుతున్నాయి. ఇక కొన్ని సందర్భాల్లో మొటిమలు మచ్చలుగా మారుతాయి. దీంతో మొహమంతా మచ్చలతో అంద విహీనంగా మారుతుంది.

దీంతో చాలా మంది మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్‌లను ఉపయోగించి, మచ్చలను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే కెమికల్స్‌తో తయారు చేసే ఇలాంటి క్రీమ్‌లను ఉపయోగించడం వల్ల కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉంటాయి. ఇలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ బారిన పడకూడదంటే కొన్ని నేచురల్‌ పద్ధతుల్లో మొటిమల ద్వారా అయిన మచ్చలకు చెక్‌ పెట్టొచ్చు. ఇలా ఇంట్లోనే లభించే వస్తువులతో కొన్ని నేచురల్‌ ఫేస్‌ ప్యాక్‌లను రడీ చేసుకోవచ్చు. అలాంటి కొన్ని ఫేస్‌ ప్యాక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* ఒక టీస్పూన్‌ శనగపిండి, ఒక టీస్పూన్‌ గులాబీ రేకుల పొడి, ఒక టీస్పూన్‌ గంధపు పొడి, అర టీస్పూన్‌ పసుపు పొడి, కొద్దిగా పాలు ఒక గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలి. అనంతరం దీనిని మొహానికి ప్యాక్‌లాగా అప్లై చేసుకోవాలి. అనంతరం 10 నుంచి 15 నిమిషాల తర్వాత చల్లటి నీరుతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మొహంపై మచ్చలు పోయి, ప్రకాశవంతంగా మారుతుంది. శనగపిండి ముఖానికి గ్లో ఇవ్వడంతోపాటు, అదనంగా ఉండే నూనెను తొలగిస్తుంది. అలాగే మొటిమలు కూడా తగ్గిపోతాయి.

* ముఖంపై ఉన్న మచ్చలు తగ్గడంలో రోజ్‌ వాటర్‌ కూడా ప్రముఖ పాత్రను పోషిస్తాయి. రోజ్‌ వాటర్‌లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి దెబ్బతిన్న చర్మాన్ని నయం చేయడంలో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మూలకాలు హానికరమైన సూక్ష్మజీవులను చురుకుగా మారకుండా నిరోధిస్తాయి.

* చందనంతో చేసే ఫేస్‌ ప్యాక్‌ మచ్చలు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. చందనంలో ఉండే నేచురల్‌ ఆయిల్‌ సన్‌టాన్‌ను తొలగించడంలో ఉపయోగపడుతుంది. చందనంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెటిమలు, వడదెబ్బ కారణంగా దెబ్బతిన్న చర్మాన్ని నయం చేయడంలో ఉపయోగపడతాయి. చందనలోని ప్రోటీన్లు చర్మాన్ని మృదువుగా మార్చుతాయి. ఈ ప్యాక్‌ను వారానికి కనీసం ఒకటి, రెండు సార్లు అప్లై చేస్తే చర్మం మునపటిలా మారుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..