ముక్కు మీద వైట్ హెడ్స్ తోని ఇబ్బంది పడుతున్నారా..? 10 నిమిషాల్లోనే ఇలా మాయం చేయండి..!

ముఖంపై సాధారణంగా కనిపించే చర్మ సమస్యల్లో వైట్ హెడ్స్ ఒకటి. ఇవి ముఖ్యంగా ముక్కు చుట్టూ ఎక్కువగా కనిపిస్తాయి. వైట్ హెడ్స్ ఏర్పడటానికి ప్రధాన కారణం చర్మంలోని సూక్ష్మ రంధ్రాల్లో మృత చర్మ కణాలు, ధూళి వంటి పదార్థాలు నిల్వ అవ్వడం. సేబాషియస్ గ్రంథులు ఎక్కువ నూనె ఉత్పత్తి చేసే ముక్కు ప్రాంతంలో వైట్ హెడ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సమస్యను చిన్నగా తీసుకోకపోతే తరువాత మొటిమలు వంటి సమస్యలు కూడా ఏర్పడవచ్చు.

ముక్కు మీద వైట్ హెడ్స్ తోని ఇబ్బంది పడుతున్నారా..? 10 నిమిషాల్లోనే ఇలా మాయం చేయండి..!
Diy Skincare

Updated on: Apr 17, 2025 | 4:11 PM

రోజూ ముఖం శుభ్రం చేయకపోవడం, చర్మం శ్వాస తీసుకోలేకపోవడం వల్ల కూడా వైట్ హెడ్స్ ఏర్పడతాయి. ముఖంపై ధూళి ఉన్నప్పుడు.. అవి చర్మంలో రంధ్రాలు మూసివేసి ఈ సమస్యకు దారి తీస్తాయి. కాబట్టి చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచి, అందుకోసం అనుకూలమైన క్లీన్‌జర్ లేదా ఫేస్ వాష్ ఉపయోగించడం.. ముఖం శుభ్రంగా కడగడం ఈ సమస్యను నివారించడంలో సహాయపడుతుంది.

ఇలాంటి సమస్యను సులభంగా తగ్గించడానికి ఇంట్లోనే తయారుచేసుకునే ఒక చిట్కా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బేకింగ్ సోడా, తేనె, నిమ్మరసం మిశ్రమం ద్వారా ఈ సమస్యను చాలా సులభంగా తగ్గించవచ్చు. ఈ మిశ్రమం తయారీకి సమపాళ్లలో ఈ మూడు పదార్థాలను తీసుకుని కలిపితే సరిపోతుంది. మిశ్రమాన్ని ముక్కు చుట్టూ నెమ్మదిగా రాసి కొద్దిసేపు మృదువుగా మసాజ్ చేయాలి. అనంతరం పదిహేను నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖం శుభ్రం చేయాలి.

బేకింగ్ సోడా చర్మంపై పని చేసే సహజ ఎక్స్‌ఫోలియంట్‌గా పనిచేస్తుంది. ఇది మృత కణాలను తొలగించి చర్మాన్ని శుభ్రంగా మార్చుతుంది. అలాగే చర్మం మీద పేరుకుపోయిన మలినాలు, ధూళి మట్టిని తొలగించే శక్తి బేకింగ్ సోడాకు ఉంటుంది. ఇది చర్మపు ఉపరితలాన్ని మెత్తగా ఉంచి కొత్త కణాల వృద్ధికి సహాయపడుతుంది. అయితే ఈ పదార్థాన్ని ఎక్కువగా వాడితే కొంతమందికి చర్మం పొడిబారే ప్రమాదం ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వాడాలి.

తేనె సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని బాక్టీరియాల నుండి రక్షిస్తూ మృదువుగా ఉంచుతుంది. ముఖంపై చర్మ సమస్యలను తగ్గించడంలో తేనె ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది చర్మాన్ని తడి స్థితిలో ఉంచి చల్లదనాన్ని కలిగిస్తుంది. అటు మొటిమలు కూడా తేనె వాడకంతో గణనీయంగా తగ్గుతాయి. సహజమైనది కావడం వల్ల దీని వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.

నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ చర్మంపై పేరుకుపోయిన అదనపు నూనెను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని శుభ్రంగా ఉంచడమే కాకుండా తళుకుగా మారేలా చేస్తుంది. నిమ్మరసం వల్ల చర్మం మసకబారకుండా ఉంటుంది. అయితే సున్నితమైన చర్మం కలవారు దీన్ని ఉపయోగించకముందు చిన్న ప్రాంతంలో పరీక్షించాలి. అలా చేస్తే అలర్జీ వస్తుందా లేదా అన్నది ముందుగానే తెలుస్తుంది.

ఈ ఇంటి చిట్కా ఖరీదైన స్కిన్ కేర్ ఉత్పత్తులు లేకుండానే మీ చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. అయితే ఇలా దీన్ని వారంలో రెండు సార్లు మాత్రమే చేయాలి. రోజూ చేయడం వల్ల చర్మం పొడిబారే అవకాశముంది. సరైన ఆహారపు అలవాట్లు పాటిస్తూ.. చర్మాన్ని శుభ్రంగా ఉంచితే వైట్ హెడ్స్ వంటి చిన్నచిన్న సమస్యలు సులభంగా అదుపులోకి వస్తాయి.