Food for Glowing Skin: మీ అందాన్ని రెట్టింపు చేసే అద్భుత ఆహారాలు.. రోజూ స్నాక్స్‌గా వీటిని తినేయండి

చర్మాన్ని ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంచేందుకు ఖరీదైన ఉత్పత్తులను ఆశ్రయిస్తుంటారు. మార్కెట్లో లభించే క్రీములు, మందులు, సౌందర్య సాధనాలు చర్మానికి తాత్కాలిక మెరుపును ఇస్తాయి. అయితే ఇవి అంత ప్రభావవంతంగా ఉండవు. కాబట్టి రసాయన ఉత్పత్తులపై ఎక్కువగా ఆధారపడటానికి బదులుగా యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఆరోగ్యకరమైన..

Food for Glowing Skin: మీ అందాన్ని రెట్టింపు చేసే అద్భుత ఆహారాలు.. రోజూ స్నాక్స్‌గా వీటిని తినేయండి
Best Foods For Skin Health

Updated on: Feb 19, 2026 | 9:10 PM

అందంగా కనిపించాలని అమ్మాయిలు నానాతంటాలు పడుతుంటారు. చర్మాన్ని ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంచేందుకు ఖరీదైన ఉత్పత్తులను ఆశ్రయిస్తుంటారు. మార్కెట్లో లభించే క్రీములు, మందులు, సౌందర్య సాధనాలు చర్మానికి తాత్కాలిక మెరుపును ఇస్తాయి. అయితే ఇవి అంత ప్రభావవంతంగా ఉండవు. కాబట్టి రసాయన ఉత్పత్తులపై ఎక్కువగా ఆధారపడటానికి బదులుగా యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, హైడ్రేషన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మీ చర్మ కాంతి సహజంగానే పెంచుకోవచ్చు. కాబట్టి ఖరీదైన ఉత్పత్తులకు ఖర్చు చేసే బదులు సరైన ఆహార అలవాట్లు పాటించడం ద్వారా చర్మానికి ప్రతిరోజూ తగినంత పోషణ అందించవచ్చు..

చర్మ కాంతిని పెంచడానికి ఏయే ఆహారాలు తీసుకోవాలి?

విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు

విటమిన్ సి చర్మానికి అత్యంత శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లలో ఒకటి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. సూర్యుని వేడి నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. కాబట్టి నారింజ, కివి, బొప్పాయి, స్ట్రాబెర్రీలు, బేరి వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు రోజు వారీ ఆహారంలో భాగంగా చేర్చుకోండి.

డ్రై ఫ్రూట్స్

బాదం, వాల్‌నట్‌లు, అవిసె గింజలు, చియా గింజలు చర్మాన్ని మృదువుగా ఉంచడంలో, పొడిబారడాన్ని ఆరోగ్యంగా మార్చడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఎందుకంటే వాటిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ E పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ అవసరమైన పరిమాణంలో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఆకుకూరలు

పాలకూర, మెంతులు, బ్రోకలీ వంటి ఆకుకూరల్లో ఐరన్, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి శరీరాన్ని నిర్విషీకరణ చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా చర్మానికి సహజమైన మెరుపును ఇస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవాలి.

చిలగడదుంప

ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మాన్ని లోపలి నుంచి పోషిస్తాయి. చిలగడదుంపలను క్రమం తప్పకుండా తినడం వల్ల చర్మ కాంతి పెరుగుతుంది. ముడతలు తగ్గుతాయి.

దానిమ్మ

దానిమ్మ ఆరోగ్యానికి నిధి మాత్రమే కాదు, అందమైన చర్మాన్ని పొందడానికి రహస్యం కూడా. దానిమ్మను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ముడతలు, ఫైన్ లైన్స్ కూడా తగ్గుతాయి.

బొప్పాయి

బొప్పాయి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కడుపును శుభ్రంగా ఉంచుతాయి. బొప్పాయి శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. ఇది చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

హైడ్రేటింగ్ ఆహారాలు, పెరుగు

దోసకాయలు, పుచ్చకాయలలో నీరు పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని రోజంతా హైడ్రేట్ గా ఉంచుతుంది. పెరుగు వంటి ప్రోబయోటిక్ ఆహారాలు పేగుతో సహా ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తాయి. ఇవి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో కూడా పోరాడతాయి. చర్మ ప్రకాశాన్ని పెంచడంలో సహాయపడతాయి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us