
చలికాలంలో చాలామందికి ముఖం నల్లగా మారుతుంది. ట్యానింగ్ అవుతుంది. ఇలాంటి సమయంలోనే ఇంట్లో చేసిన ఫేస్ ప్యాక్ వేసుకుంటే మీ చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇందుకోసం శనగపిండి మీకు అద్భుతమైన ఫలితాన్నిస్తుంది. చర్మానికి శనగపిండి ఫేస్ ప్యాక్‌లు వేయడం చాలా కాలంగా ఉంది. అమ్మమ్మల కాలం నుండి ఈ శనగపిండిని వంటకాల కోసం మాత్రమే కాకుండా..ముఖం మెరుపును పెంచుకోవడానికి, అనేక రకాల చర్మ సమస్యలను దూరం చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. శనగపిండి అనేక లక్షణాలతో సమృద్ధిగా ఉంటుంది. చర్మంపై దాని ప్రభావాలు కొన్ని రోజుల్లోనే కనిపిస్తాయి. ఇది చర్మంపై మృతకణాలను తొలగిస్తుంది. రంగును మెరుగుపరుస్తుంది. ఇంకా ఏవైనా ఇతర చర్మ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, శనగపిండిని ఉపయోగించడానికి సంకోచించకండి.
శనగ పిండిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలు, మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతాయి. చర్మ రంధ్రాలను శుభ్రపరచడంలో కూడా సహాయపడతాయి. చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచే సహజమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ముఖం నుండి అదనపు నూనెను గ్రహించడంలో కూడా సహాయపడుతుంది. చర్మాన్ని బిగుతుగా చేయడానికి, ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. శనగపిండితో ఫేస్ మాస్క్ తయారుచేయడం చాలా సులభం.
2 చెంచాల శనగపిండి, 1 చెంచా ముల్తానీ మట్టి, కాఫీ, నిమ్మరసం, 2 చెంచాల పెరుగు కావాలి. ఈ అన్ని పదార్థాలను కలిపి పెట్టుకోండి. ఈ ఫేస్ మాస్క్‌ను ముఖానికి, మెడకు రాసుకోవచ్చు. సున్నితంగా మసాజ్ చేసి 20 నిమిషాలు అలానే వదిలేయండి. తర్వాత ముఖం కడుక్కోండి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో ముఖం కడుక్కోండి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే ట్యానింగ్ తగ్గుతుంది. శనగపిండితో మీ ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. ఫేస్ ప్యాక్ కోసం అయ్యే ఖర్చును తగ్గించుకోవచ్చు. ఇంట్లో దొరికే వాటితో ఈ ఫేస్‌ప్యాక్‌ను మూడుసార్లు వాడితే మీ ముఖంపై మంచి గ్లో వస్తుంది.
శెనగపిండిలో చిటికెడు పసుపు కలిపి ముఖానికి పట్టింవచ్చు. ముల్తాని మట్టి, కాస్త పాలు వంటివి కలిపి రాసినా చాలు. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిన అవసరం రాదు.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..