Braiding Hair: జడ వేయకుండా కురులు వదిలేసే అమ్మాయిలకు షాక్.. త్వరలోనే మీ జుట్టు హుష్! ఎందుకంటే..
నేటి కాలంలో సాధారణంగా అమ్మాయిలు జుట్టును అలా ఫ్రీగా వదిలేసి తిరుగుతున్నారు. ఫ్యాషన్ పేరిట రకరకాల హెయిర్ స్టైల్స్ ఫాలో అవుతున్నారు. నిజానికి.. అమ్మాయిలు జడ వేసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయట. చాలామంది జుట్టును జడ వేయడం కేవలం అలంకరణ కోసమే అని అనుకుంటారు..

ఒకప్పుడు అమ్మాయిలు చక్కగా జడలు వేసుకుని పది మూర్ల మల్లెలు జడలో తురుముకుని ఎంతో సంప్రదాయ బద్దంగా ఉండేవారు. కానీ నేటి కాలంలో ఈ సీన్ గుడుల్లోనూ, గ్రామాల్లో కనీసం పెళ్లిళ్లలోనూ ఎక్కడా కనిపించదు. కారణం.. మారినకాలమే. నేటి కాలంలో సాధారణంగా అమ్మాయిలు జుట్టును అలా ఫ్రీగా వదిలేసి తిరుగుతున్నారు. ఫ్యాషన్ పేరిట రకరకాల హెయిర్ స్టైల్స్ ఫాలో అవుతున్నారు. నిజానికి.. అమ్మాయిలు జడ వేసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయట. చాలామంది జుట్టును జడ వేయడం కేవలం అలంకరణ కోసమే అని అనుకుంటారు. నిజానికి, అలంకరణ కోసమే కాదు.. ప్రతిరోజూ జుట్టును జడ వేయడం వల్ల ఆరోగ్యంపై ఎన్నో రకాలుగా ప్రభావం చూపుతుందట. అవును.. జడ వేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరగడంతోపాటు శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుందని స్వయంగా ఆరోగ్య నిపుణులే చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
జడల జుట్టు తేమను నిలుపుతుంది
ప్రతిరోజూ జడ వేసుకోవడం వల్ల జుట్టు సహజ తేమను కాపాడుతుంది. ఈ విధంగా జడ వేసుకోవడం వల్ల వాతావరణంలో వచ్చే మార్పుల నుంచి జుట్టును రక్షిస్తుంది.
తల చర్మ రక్షణ
ఆరోగ్యకరమైన జుట్టు కోసం, ఆరోగ్యకరమైన తల చర్మం కలిగి ఉండటం చాలా ముఖ్యం. తల చర్మం ఎండిపోకుండా ఉండటానికి, జుట్టును ప్రతిరోజూ నూనెతో మసాజ్ చేయడం మంచిది. ఇది నెత్తిమీద శిలీంధ్ర సమస్యలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఫలితంగా దురద, చుండ్రు సమస్య ఉండదు.
జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది
రోజువారీ వాయు కాలుష్యం, సూర్యరశ్మి, అధిక వేడికి గురికావడం వల్ల జుట్టు విరిగిపోయి చిట్లిపోతుంది. ఫలితంగా, ఇది జుట్టు రాలడానికి దారితీస్తుంది. ప్రతిరోజూ జుట్టును వివిధ మార్గాల్లో స్టైలింగ్ చేయడం వల్ల జుట్టు చివరలు దెబ్బతినడం జరుగుతుంది. అందువల్ల, జుట్టును చక్కగా దువ్వి జడ వేయడం వల్ల వెంట్రుకలకు పోషణ లభిస్తుంది. ఇది చివర్లు చిట్లడం సమస్యను తగ్గిస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
జుట్టు పెరుగుదలకు ప్రోత్సాహం
జడ వేసుకోవడం ఆరోగ్యకరమైన జుట్టును నిర్వహించడానికి, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ప్రతిరోజూ జుట్టును దువ్వి జడ వేయడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. కానీ చాలా గట్టిగా జడ వేయకూడదు. వీలైనంత వదులుగా, సౌకర్యవంతంగా వేసుకోవడం మంచిది.
గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.