
వర్షాకాలంలో వాతావరణం భిన్నంగా ఉంటుంది. వేడి తేమతో కూడిన వాతావరణంలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం అతిపెద్ద అవసరం. అటువంటి పరిస్థితిలో ప్రజలు అనేక రకాల ఆరోగ్యకరమైన పానీయాలను తీసుకునేందుకు మొగ్గు చూపుతారు. వాటిలో గ్రీన్ టీ కూడా ఒక ప్రసిద్ధ ఎంపికగా మారింది. బరువు తగ్గడం నుంచి డీటాక్స్ వరకు గ్రీన్ టీని ఆరోగ్య నిధిగా పరిగణిస్తారు. అయితే వర్షాకాలంలో గ్రీన్ టీ తాగడం నిజంగా సరైనదేనా? అని ఆలోచిస్తారు. వర్షం, తేమ, ఎండలు వంటి విభిన్నమైన వాతావరణంలో గ్రీన్ టీ తాగాలా వద్దా? తాగితే దానిని ఏ సమయంలో? ఎంత పరిమాణంలో తీసుకోవడం సురక్షితం? తెలుసుకుందాం..
ఢిల్లీలోని పట్పర్‌గంజ్‌లోని మాక్స్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ మీనాక్షి జైన్ ఏ సీజన్ అయినా సరే శరీరంలో ద్రవాల అవసరం ఉంటుందని చెప్పారు. ఈ సమయంలో దాహం తక్కువగా ఉంటుంది కనుక శరీరంలో తేమని నిర్వహించేందుకు ద్రవ పదార్ధాలను తీసుకోవడం తప్పనిసరి. అటువంటి పరిస్థితిలో సాధారణ టీ, కాఫీ తీసుకోవడం కంటే గ్రీన్ టీ తీసుకుంటే శరీరంలో ద్రవం పరిమాణం పెరుగుతుంది. శరీరంలో ద్రవాలను పెంచడానికి గ్రీన్ టీ మంచిది. శరీరాన్ని డీహైడ్రేట్ బారిన పడకుండా చేస్తుంది.
న్ టీతో పాటు తులసి టీ, తేనె, అల్లం టీ లేదా మరే ఇతర మూలికలతో తయారు చేసిన టీ తాగినా..ఆరోగ్యానికి ఆరోగ్యం.. శరీరంలో నీటి శాతాన్ని పెంచేందుకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ సహజ పానీయాలు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడతాయి. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే కెఫిన్ నిర్జలీకరణానికి కారణమవుతుంది. హృదయ స్పందన రేటును పెంచుతుంది. మరోవైపు గ్రీన్ టీలో శరీరంలో నిర్జలీకరణాన్ని పెంచే ఉత్పత్తులు ఉండవు. కనుక ఈ టీని ఏ సీజన్ లోనైనా తీసుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..