AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌లలో ఏది బెస్ట్..?

Beetroot Juice vs Pomegranate Juice: బీపీ సమస్యతో బాధపడేవారికి ఆహారపు అలవాట్లే ప్రధాన ఔషధంలా పనిచేస్తాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలామంది పండ్ల రసాలను ఆశ్రయిస్తుంటారు. అందులోనూ బీట్‌రూట్, దానిమ్మ జ్యూస్‌లు బీపీని అదుపు చేయడంలో అద్భుతంగా తోడ్పడతాయని అందరికీ తెలుసు. అయితే ఈ రెండింటిలో ఏది వేగంగా, ఎక్కువ కాలం బీపీని సమర్థవంతంగా తగ్గిస్తుంది? అనేది తెలుసుకుందాం..

మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌లలో ఏది బెస్ట్..?
Beetroot Juice Vs Pomegranate Juice
Krishna S
|

Updated on: Oct 12, 2026 | 3:16 PM

Share

గుండెను పదిలంగా ఉంచుకోవడానికి, రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి బీట్‌రూట్ జ్యూస్, దానిమ్మ రసం రెండూ ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ రెండింటిలో బీపీని తగ్గించే విషయంలో ఏది ఎక్కువ ప్రభావం చూపుతుందనే దానిపై నిపుణులు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అమెన్‌ క్లినిక్స్‌కు చెందిన డాక్టర్ ఎబోని కార్నిష్ ప్రకారం.. వేగంగా, సమర్థవంతంగా బ్లడ్ ప్రెజర్‌ను కంట్రోల్ చేయడంలో దానిమ్మ రసం కంటే బీట్‌రూట్ జ్యూసే ముందుంటుంది. దీనికి బలమైన శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ రక్తప్రసరణ సాఫీగా సాగడానికి, రక్తనాళాలు దృఢంగా ఉండటానికి బీట్‌రూట్ లోని సహజ పోషకాలు ఎంతగానో సహాయపడతాయి.

బీట్‌రూట్‌కు ఆ ముదురు రంగును ఇచ్చే సహజ రంగు కారకాలు (బీటాలైన్స్ అనే సహజ వర్ణద్రవ్యాలు), అందులోని నైట్రేట్లు బీపీని తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ నైట్రేట్లు శరీరంలోకి వెళ్లిన తర్వాత ‘నైట్రిక్ ఆక్సైడ్’గా మారి రక్తనాళాలు వ్యాకోచించేలా చేస్తాయి. దీనివల్ల రక్తప్రసరణ వేగవంతమై బీపీ తగ్గుముఖం పడుతుంది. హైబీపీ ఉన్నవారు రోజూ 70 నుంచి 250 మిల్లీలీటర్ల బీట్‌రూట్ రసం తాగితే సిస్టోలిక్ బీపీ గణనీయంగా తగ్గుతుందని అధ్యయనాలు నిరూపించాయి. ముఖ్యంగా ఈ రసాన్ని రోజూ తాగినా శరీరం దీనికి అలవాటు పడిపోయి ప్రభావం తగ్గిపోవడం లాంటి సమస్యలు ఉండవు.

దానిమ్మతో 2 నెలలు మాత్రమే..

దానిమ్మ రసం విషయానికి వస్తే.. ఇందులో యాంతోసైనిన్లు వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తనాళాల్లోని మంట, వాపులను తగ్గించి, గుండె ధమనుల్లో పూడికలు (ప్లాక్) చేరకుండా కాపాడతాయి. దానిమ్మ రసం సిస్టోలిక్, డయాస్టోలిక్ బీపీ రెండింటినీ నియంత్రిస్తుంది. అయితే అధ్యయనాల ప్రకారం ఈ ప్రయోజనం నిరంతరంగా రెండు నెలల వరకు మాత్రమే ప్రభావవంతంగా పనిచేస్తుంది.

పోషకాల పరంగా చూస్తే.. బీట్‌రూట్ జ్యూస్‌లో క్యాలరీలు (62), కార్బోహైడ్రేట్లు (14.64 గ్రాములు), షుగర్ (12 గ్రాములు) చాలా తక్కువగా ఉండి, పీచు పదార్థం (2.72 గ్రాములు) ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి, కార్బ్స్ తగ్గించాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక. మరోవైపు దానిమ్మ రసంలో క్యాలరీలు (134), కార్బోహైడ్రేట్లు (32.6 గ్రాములు) కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ, బీపీ నియంత్రణకు మేలు చేసే పొటాషియం (533 మిల్లీగ్రాములు) బీట్‌రూట్ కంటే దాదాపు 64 శాతం అధికంగా లభిస్తుంది. శరీర అవసరాలు, ఆరోగ్యాన్ని బట్టి ఈ రెండింటినీ సరైన మోతాదులో తీసుకోవడం ఎంతో ప్రయోజనకరం.

Follow Us
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర