బీట్‌రూట్ జ్యూస్ అలాంటి వారికి విషంతో బరాబర్.. వామ్మో.. పెద్ద కథే ఉందిగా..
బీట్‌రూట్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకు మూలం.. దుంపజాతికి చెందిన బీట్‌రూట్‌లలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. నైట్రేట్లు, పొటాషియం, ఫైబర్, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.. ఇంకా రక్తపోటును నియంత్రిస్తాయి.. గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.. శక్తినివ్వడంతోపాటు.. రక్తహీనతను తగ్గిస్తాయి..

బీట్‌రూట్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకు మూలం.. దుంపజాతికి చెందిన బీట్‌రూట్‌లలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. నైట్రేట్లు, పొటాషియం, ఫైబర్, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.. ఇంకా రక్తపోటును నియంత్రిస్తాయి.. గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.. శక్తినివ్వడంతోపాటు.. రక్తహీనతను తగ్గిస్తాయి.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.. ఇంకా మెరుగైన జీర్ణక్రియకు సహాయపడతాయి. అందుకే.. బీట్‌రూట్‌లు ఆరోగ్యానికి చాలా మంచివని. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.. అయితే.. తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. కానీ కొంతమంది ఈ బీట్‌రూట్ జ్యూస్ తాగకూడదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది వారికి ప్రయోజనం కంటే ప్రమాదకరం..
నిజానికి, బీట్‌రూట్‌లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. ఖాళీ కడుపుతో బీట్‌రూట్ రసం తాగడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బీట్‌రూట్‌లో ఖనిజాలతోపాటు.. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, ఐరన్ , విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని అనేక ఆరోగ్య సమస్యల నుండి కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు.
కానీ దాని జ్యూస్ కొంతమందికి విషపూరితం కావచ్చని పేర్కొంటున్నారు. ముఖ్యంగా తక్కువ రక్తపోటు ఉన్నవారు బీట్‌రూట్ రసం తాగకుండా ఉండాలి. బీట్‌రూట్‌లోని సమ్మేళనాలు రక్తపోటును మరింత తగ్గిస్తాయి.
అలాంటి వారు అనుకోకుండా బీట్‌రూట్ రసం తాగితే.. వారికి ఆకస్మికంగా తలతిరుగుడు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. అందుకే తక్కువ రక్తపోటుతో బాధపడేవారు ఎల్లప్పుడూ బీట్‌రూట్ రసం తీసుకోవడం మానుకోవాలని సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




