Beer: నేటి యువతరం వీకెండ్ వస్తే చాలు ఎక్కువగా పార్టీలు చేస్తుంటారు. ఆ పార్టీలలో కచ్చితంగా బీర్ బాటిల్స్ ఉండాల్సిందే. ఎందుకంటే బీర్ ప్రియులు ఎక్కువగా ఉంటారు. అంతేకాదు చాలామందికి ఒక అపోహ కూడా ఉంటుంది. బ్రాంది, విస్కీతో పోల్చితే బీర్ వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదని అనుకుంటారు. కానీ బీర్‌లో కూడా ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. ఇది బ్రాంది, విస్కీల వలే ఆరోగ్యానికి హాని చేస్తుంది. కాలేయం, మెదడుని ప్రభావితం చేస్తుంది. బీర్ ప్రభావం శరీరంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం.
బీర్ శరీరానికి ఏమి చేస్తుంది?
బీర్ తాగినప్పుడు అది నేరుగా చిన్న ప్రేగులలోకి వెళుతుంది. తర్వాత బీర్‌లో ఉన్న ఆల్కహాల్ రక్తంలో కలుస్తుంది. రక్తం దానిని శరీరంలోని ఇతర కణాలకు చేరవేస్తుంది. ఇక్కడ ఆల్కహాల్‌లోని పోషకాలు కరగకుండా అలాగే ఉంటాయి. తర్వాత ఇవి కాలేయానికి చేరుకుంటాయి. కాలేయం వీటిని ఫిల్టర్ చేసే పనిని ప్రారంభిస్తుంది. ఇంతలో ఆల్కహాల్ మెదడుకు చేరుకోవడంతో కొన్ని స్రవాలు విడుదల అవుతాయ. ఇవి మాట్లాడటం, నవ్వడం మొదలైన వాటిని నియంత్రిస్తాయి. అధిక బీర్ సేవించిన వ్యక్తి ఏదైనా మాట్లాడటం, ఏదైనా చేయడం ప్రారంభిస్తాడు. ప్రతిరోజు ఒకటి కంటే ఎక్కువ బీర్లు తాగుతున్న వ్యక్తులు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అధికం ఎప్పుడైనా ప్రమాదమే.
ఇది కాలేయాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది
కాలేయంపై ఆల్కహాల్ అతిపెద్ద ప్రభావాన్ని చూపుతుంది. కాలేయంలో కొవ్వు మొత్తం పెరిగి అది సరిగా పనిచేయలేకపోతుంది. ఆల్కహాల్ మానేసినప్పుడు లివర్ మళ్లీ రిపేర్ అవ్వడం మొదలవుతుంది కాలేయ కణాలను ఏర్పాటు చేస్తుంది. కానీ కాలేయం కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. మునుపటిలా పనిచేయలేకపోతుంది కాబట్టి మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం.