Beauty Tips: అందమైన గులాబీ రంగు చెక్కిళ్లు కావాలంటే ఈ 5 ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోండి..

Beauty Tips: తమకు అందమైన గులాబీ రంగు చెక్కిళ్లు కావాలని ఎవరికి మాత్రం కోరిక ఉండదు చెప్పండి. మీకు కూడా ఇలాంటి కోరిక ఉంటే.. మీ కోసమే

Beauty Tips: అందమైన గులాబీ రంగు చెక్కిళ్లు కావాలంటే ఈ 5 ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోండి..
Cheeks

Updated on: Apr 17, 2022 | 6:33 AM

Beauty Tips: తమకు అందమైన గులాబీ రంగు చెక్కిళ్లు కావాలని ఎవరికి మాత్రం కోరిక ఉండదు చెప్పండి. మీకు కూడా ఇలాంటి కోరిక ఉంటే.. మీ కోసమే ఈ టిప్స్. మీరు తినే ఆహారంలో కొన్నింటిని చేర్చుకుంటే మీ కల నెరవేరుతుందనడం సందేహం లేదు. ఇవి మీ శరీరంలో రక్తాన్ని పెంచడమే కాకుండా రక్తాన్ని శుద్ధి చేసి చర్మ కాంతిని పెంచుతుంది. మీ రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం వలన మీ బుగ్గలు అందమైన గులాబీ రంగులోకి మారిపోతాయి. అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడొచ్చు. మరి ఆ ఆహార పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. అంజీర్ పండ్లు..
అత్తి పండు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిని డైరెర్ట్‌గా లేదా ఖీర్, స్నాక్స్, సలాడ్ మొదలైన రూపంలో తినవచ్చు. ఇంకా ఎండు అత్తి పండ్లను పాలలో ఉడికించి కూడా తినొచ్చు. పాలలో మెత్తగా మారిన అంజీర పండ్లను తినవచ్చు. ఇలా చేయడం ద్వారా మీ కడుపులో మంట అనే సమస్యే ఉండదు. రక్తం శుద్ధి అవుతుంది. రక్త ప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుంది. ఫలితంగా చర్మ కాంతి పెరుగుతుంది.

2. బచ్చలికూర..
బచ్చలికూర, పాలకూర వంటి ఆకు కూరలు, కూరగాయలు తినడం వల్ల శరీరంలో రక్తహీనత తొలగిపోతుంది. రక్త ప్రసరణ పెరిగి చర్మం మెరుస్తుంది.

3. బాదం పప్పు..
బాదం పప్పు తినడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మెదడుకు చురుకుగా చేస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఇందులో విటమిన్ ఇ సమృద్ధిగా ఉండటం వల్ల చర్మానికి చాలా మేలు జరుగుతుంది.

4. ఆపిల్ రసం, తేనె..
యాపిల్ జ్యూస్‌లో తేనె కలిపి తాగడం వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది. ఈ రెసిపీ శరీరంలో రక్త స్థాయిని పెంచడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి దోహదపడుతుంది. యాపిల్ జ్యూస్‌లో ఒక స్ఫూ్న్ తేనె మిక్స్ చేసి తింటే ప్రయోజనం ఉంటుంది.

5. బీట్‌రూట్ జ్యూస్..
రోజుకు ఒకసారి సలాడ్‌లో బీట్‌రూట్ తినాలి. లేదా బీట్‌రూట్ జ్యూస్ తాగాలి. మీ శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా, రక్తం ప్రసరణ మెరుగువుతుంది. తద్వారా మీ చెంపలు నాజూకుగా మారుతాయి. గులాబీ రంగులో తళుక్కుమంటాయి.

Also read:

Delhi Files – Vivek Agnihotri: ఇక ‘ఢిల్లీ ఫైల్స్’.. సంచలన ప్రకటన చేసిన వివేక్ అగ్నిహోత్రి..

Viral Video: ఈ రైతు చాలా స్మార్ట్ గురూ.. పొలం పనుల్లో సరికొత్త ప్రయోగం.. మీకూ ఉపయోగపడొచ్చు ఓ లుక్కేయండి..!

Russia – Ukraine War: పుతిన్‌కు ఆగ్రహం కలిగించిన ఆ ఘటన.. సైన్యానికి కీలక ఆదేశాలు జారీ..!