Facial Glow: బ్యూటీ పార్లర్‌తో పనిలేదు ఇంట్లోనే ఫేషియల్ గ్లో..! ఈ టిప్స్‌ ఫాలో అయితే చాలు.. మెరుపుఖాయం!!

|

Jun 21, 2024 | 9:06 PM

ఇది మీ ముఖానికి అందమైన గులాబీ రంగును ఇస్తుంది. అలాగే, రోజ్ వాటర్‌ను ముఖంపై స్ప్రే చేసుకుంటే కూడా చర్మాన్ని పొడి కాకుండా తేమగా ఉంచుతుంది. ఇలా ఉంచడం వల్ల చర్మం ఎప్పుడు నిగనిగలాడుతూ ఉంటుంది. ఇది ట్యాన్‌ ప్యాక్‌లా పనిచేస్తుంది. ముఖానికి, బుగ్గల పై తేనె రాసుకుంటే కూడా మొహం స్మూత్ గా మెరుస్తూ కనిపిస్తుంది. పచ్చిపాలలో తేనెను కలిపి మొహానికి రాసుకుంటే మీ చర్మం బంగారంలా మెరిసేలా చేస్తుంది.

Facial Glow: బ్యూటీ పార్లర్‌తో పనిలేదు ఇంట్లోనే ఫేషియల్ గ్లో..! ఈ టిప్స్‌ ఫాలో అయితే చాలు.. మెరుపుఖాయం!!
Facial Glow
Follow us on

సహజంగా అమ్మాయిలు అందంగా కనిపించాలని. తమ మొహం మెరిసిపోవాలని కోరుకుంటారు. ఇందులో భాగంగా ప్రస్తుత యువత ఎక్కువగా ఫేషియల్స్ వైపు మక్కువ చూపిస్తున్నారు. కానీ, ఫేషియల్స్‌ చేసుకోవడం వల్ల స్కిన్ కి హానికలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫేషియల్ క్రీమ్స్ లో ఉండే కెమికల్స్ లాంగ్ రన్ లో ముఖ సౌందర్యాన్ని పాడుచేస్తాయి. అయితే ఫేషియల్ లేకుండా మొహం మెరుస్తూ ఉండడానికి ఇంటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

సహజ సిద్ధంగా ఫేస్‌లో మంచి గ్లో కనిపించాలంటే గులాబీ ఆకులను గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకున్నట్టయితే ముఖం తేమగా ఉంటుంది. ఇది మీ ముఖానికి అందమైన గులాబీ రంగును ఇస్తుంది. అలాగే, రోజ్ వాటర్‌ను ముఖంపై స్ప్రే చేసుకుంటే కూడా చర్మాన్ని పొడి కాకుండా తేమగా ఉంచుతుంది. ఇలా ఉంచడం వల్ల చర్మం ఎప్పుడు నిగనిగలాడుతూ ఉంటుంది. ఇది ట్యాన్‌ ప్యాక్‌లా పనిచేస్తుంది. ముఖానికి, బుగ్గల పై తేనె రాసుకుంటే కూడా మొహం స్మూత్ గా మెరుస్తూ కనిపిస్తుంది. పచ్చిపాలలో తేనెను కలిపి మొహానికి రాసుకుంటే మీ చర్మం బంగారంలా మెరిసేలా చేస్తుంది.

గోల్డెన్ ఫేషియల్ చేసుకుంటే ఎంతలా మీ ముఖం మెరుస్తుందో..పచ్చిపాలు, తేనెను కలిపి ముఖానికి రాసుకుంటే కూడా అలాగే మెరుస్తుంది. అలాగే, ఫేషియల్‌ గ్లో కోసం మరో చిట్కా కూడా ఉంది.. అందేంటంటే.. పంచదార.. కొబ్బరి నూనె.. కాఫీ పొడితో కలిపి ముఖానికి పట్టించి కాసేపు అలాగే ఉంచుకుని కాసేపటి తర్వాత చల్లని నీళ్ళతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం మీ ముఖం మెరిసే నిగారింపును సొంతం చేసుకుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇవి ఫాలో అయ్యి చూడండి. ఫేషియల్ లేకుండానే ఫేషియల్ గ్లో మీ సొంతం అవుతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)