AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మండే ఎండల్లోనూ బాడీని కూల్‌గా ఉంచే.. మామిడికాయ, పుదీనా జ్యూస్.. ఇలా చేసి తాగితే…

ఎండా కాలం ముగింపు దశకు చేరుకున్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎండలు తగ్గట్లేదు. ఈ మండే ఎండల నుంచి శరీరాన్ని కాపాడేందుకు పుదీనా, మామిడికాయ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. పుదీనాలోని సహజసిద్ధమైన చలవ, పచ్చి మామిడికాయలోని గుణాలు శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా పొట్టను లోపలి నుండి చల్లగా ఉంచుతాయి. ఇంట్లోనే నిమిషాల్లో ఈ సూపర్ డ్రింక్‌ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

మండే ఎండల్లోనూ బాడీని కూల్‌గా ఉంచే.. మామిడికాయ, పుదీనా జ్యూస్.. ఇలా చేసి తాగితే...
Mint Mango Shikanji
Anand T
|

Updated on: Jun 06, 2026 | 10:32 AM

Share

సమ్మర్ సీజన్ అయిపోతున్నా.. ఎండల ప్రభావం మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఇలాంటి సమయంలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం, ఎండ దెబ్బ తగలకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ కాలంలో మార్కెట్లో దొరికే ప్యాక్డ్ జ్యూస్‌లు లేదా కూల్ డ్రింక్స్ తాగే కంటే, ఇంట్లోనే తయారుచేసుకునే దేశీ, నాచురల్ డ్రింక్స్ అన్నింటికంటే బెస్ట్ ఆప్షన్. కాబట్టి పచ్చి మామిడికాయ వడదెబ్బ తగలకుండా కాపాడటంలో చాలా బాగా పనిచేస్తుంది. ఈ రెండింటి రిఫ్రెషింగ్ కాంబినేషన్ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. కాబట్టి దీన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం

కావలసిన పదార్థాలు

1 కప్పు పచ్చి మామిడికాయ ముక్కలు ఉడికించినవి, 1 కప్పు తాజా పుదీనా ఆకులు. 4-5 పెద్ద చెంచాల చక్కెర లేదా పటిక బెల్లం పొడి , 1 చెంచా వేయించిన జీలకర్ర పొడి, 1 చెంచా నల్ల ఉప్పు , 1/2 చెంచా మామూలు ఉప్పు, 1/2 చెంచా చాట్ మసాలా. అలాగే 1 నిమ్మకాయ, చల్లని నీరు, తగినన్ని ఐస్ ముక్కలు ఉంటే సరిపోతుంది.

తయారుచేసే విధానం

మొదట పచ్చి మామిడికాయ తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీన్ని కొద్దిగా నీళ్లు పోసి 5-7 నిమిషాల పాటు మామిడికాయ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో ఉడికించిన మామిడికాయ ముక్కలు వేసి, శుభ్రం చేసిన పుదీనా ఆకులు, చక్కెర లేదా పటిక బెల్లం పొడి, నల్ల ఉప్పు, మామూలు ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, చాట్ మసాలా వేయాలి.

తర్వాత ఇందులో అర కప్పు చల్లని నీరు పోసి, మిక్సీ పట్టి మెత్తని ప్యూరీ ,పేస్ట్‌లా సిద్ధం చేసుకోవాలి. పుదీనా ఆకులు బాగా నలిగేలా చూసుకోవాలి. ఇలా తయారైన చిక్కటి మిశ్రమాన్ని ఒక పెద్ద జగ్గులోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పైనుంచి ఒక నిమ్మకాయ రసాన్ని పిండి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ జగ్గులో 3-4 గ్లాసుల చల్లని నీరు లేదా సోడా నీరు పోసి చెంచాతో బాగా కలపాలి. మీకు నచ్చితే ఈ మిశ్రమాన్ని వడకట్టుకోవచ్చు కూడా.

తర్వాత సర్వింగ్ గ్లాసులలో మొదట 3-4 ఐస్ ముక్కలు వేయాలి. దానిపై తయారు చేసి పెట్టుకున్న పుదీనా-మామిడికాయ జ్యూస్ పోయాలి. గ్లాసును పుదీనా ఆకులు, నిమ్మకాయ ముక్కతో గార్నిష్ చేసి చల్లచల్లగా సీప్ చేస్తూ తాగితే.. ఆహా క్షణాల్లో బాడీ కూల్ అవ్వాల్సిందే.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్