Banana Peel Uses: తొక్కే కదా అని తీసిపారేయకండి.. అనేక చర్మ సమస్యలకు ఇది అద్భుత పరిష్కారం!

|

Dec 07, 2022 | 11:46 AM

ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత అరటిపండు తొక్కతో ముఖాన్ని స్క్రబ్ చేయండి. ఇది మీకు మంచి లాభాలను కలిగిస్తుంది.

Banana Peel Uses: తొక్కే కదా అని తీసిపారేయకండి.. అనేక చర్మ సమస్యలకు ఇది అద్భుత పరిష్కారం!
Banana Peel Uses
Follow us on

అరటిపండులో ఉండే అనేక ఆరోగ్య ప్రయోజనాల దాగి ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. అరటి పండులో అద్భుతమైన కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, పొటాసియం, మెగ్నీషియం ఉన్నాయి. అయితే, అరటిపండులోనే కాదు, అరటి తొక్కలో కూడా ఆరోగ్యానికి మేలు చేసే అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా అరటి తొక్కలో అనేక బ్యూటిబెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు. అరటితోక్కతో చర్మం మీద రుద్దడం వల్ల చర్మానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది . అరటిపండు గుజ్జుకంటే, అరటి తొక్కలో ప్రయోజనాలు ఎక్కువ. అరటి తొక్క, స్వచ్చమైన చర్మ సౌందర్యం పొందడానికి, మచ్చలు మొటిమలు మాయం చేయడానికి, వృద్యాప్యఛాయలను నివారించడానికి ఇది చాలా గొప్పగా సహాయపడుతుంది.

అరటి తొక్కలో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ బి12, యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మీ చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను దూరం చేస్తుంది. అరటి తొక్క కూడా ముడతలు, మొటిమలను తగ్గిస్తుంది. అంతే కాదు, అరటిపండు తొక్కలు తినడం వల్ల మీ జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మీ ఆరోగ్యానికి చర్మానికి అరటి తొక్క వల్ల ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలు దొరుకుతాయి.

మొటిమలు, ముడతల నుండి ఉపశమనం పొందడానికి మీరు అరటి తొక్కను ఉపయోగించవచ్చు. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఇందులో ఉన్నాయి. ఇది మొటిమలు, ముడతలను తొలగించడంలో సహాయపడుతుంది. ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత అరటిపండు తొక్కతో ముఖాన్ని స్క్రబ్ చేయండి. ఇది మీకు మంచి లాభాలను కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

అరటి తొక్క జీర్ణవ్యవస్థను కూడా నయం చేస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని ఉపయోగం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అరటి తొక్క మలబద్ధకం, విరేచనాల సమస్యలను కూడా నయం చేస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, మీరు అరటి తొక్క తినవచ్చు. విటమిన్ ఎ ఇందులో లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి