
చాలా మందికి పడుకునే ముందు పాదాలను మసాజ్ చేసే అలవాటు ఉంటుంది. కొందరు కొబ్బరి నూనెతో చేస్తారు.. మరికొందరు నెయ్యితో చేస్తారు. ఈ రకమైన మసాజ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నెయ్యితో పాదాలను మసాజ్ చేయడం వల్ల మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి. కానీ ఇటీవలి కాలంలో ఎవరూ ఈ పురాతన పద్ధతిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. కానీ ఒకప్పుడు చాలా మంది ప్రతి రాత్రి పడుకునే ముందు తమ పాదాలకు నెయ్యి రాసుకునే పద్ధతిని అనుసరించేవారు. దీని వెనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మరీ. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. కాబట్టి ఇది ఎలాంటి సమస్యలకు ప్రయోజనకరంగా ఉంటుంది? ఈ పురాతన పద్ధతిని ఎందుకు అనుసరించాలో ఇక్కడ తెలుసుకుందాం..
పాదాలకు నెయ్యి రాయడం వల్ల శరీరం నుంచి విషాన్ని బయటకు పంపి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. నెయ్యిలో ఉండే విటమిన్లు A, D, E మొదలైన పోషకాలు రోగనిరోధక శక్తిని మరింత పెంచడానికి పనిచేస్తాయి. ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా వ్యాధులు, ఇన్ఫెక్షన్లను నివారించడంలో కూడా సహాయపడతాయి. రోగనిరోధక శక్తి పెరిగినప్పుడు సీజనల్ జలుబు, ఫ్లూ వంటి అనేక సమస్యలు దూరంగా ఉంటాయి.
పాదాలు ఎక్కువగా నేలపైనే ఉండటం వల్ల, పర్యావరణ కారకాల వల్ల చర్మం క్రమంగా పొడిగా, గరుకుగా మారుతుంది. నెయ్యి ఇటువంటి సమస్యలకు గొప్ప పరిష్కారం. ఇది తేమ లక్షణాలను కలిగి ఉంటుంది. చర్మానికి పోషణను అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అంతేకాకుండా పగిలిన మడమలకు నెయ్యితో మసాజ్ చేయడం వల్ల పగిలిన మడమల రూపాన్ని కూడా తగ్గించవచ్చు. ఇది పాదాలపై చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఇందుకోసం ముందుగా పాదాలను గోరువెచ్చని నీటితో కడిగి ఆరబెట్టాలి. ఇవి పూర్తిగా ఆరిపోయాక కొంచెం నెయ్యిని తీసుకొని పాదాలకు అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి.
అరికాళ్ళపై ఉన్న నరాల చివరలు, రిఫ్లెక్సాలజీ పాయింట్లు మన శరీరంలోని వివిధ వ్యవస్థలు, అవయవాలకు అనుసంధానించబడి ఉంటాయి. అరికాళ్ళను మసాజ్ చేసినప్పుడు ఆ పీడన బిందువులు ప్రేరేపించబడతాయి. ఇది శరీరమంతా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ పెరగడం వల్ల కణాలు, కణజాలాలు ఆక్సిజన్ ద్వారా అవసరమైన పోషకాలను సరిగ్గా పొందుతాయి. అంతేకాకుండా పాదాలను నెయ్యితో మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మనస్సు ప్రశాంతంగా, విశ్రాంతిగా ఉంటుంది.
మనకు నిద్ర చాలా ముఖ్యం. సరైన నిద్ర రాకపోతే, రాత్రిపూట పాదాలకు వెన్న లేదా నెయ్యి రాసి మసాజ్ చేయడం మంచిది. ఇది మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుంది. శరీర శక్తి కూడా సమతుల్యంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. నాడీ వ్యవస్థ విశ్రాంతి పొందుతుంది. ఫలితంగా ఎటువంటి ఆలోచనలు లేకుండా నిద్రపోవచ్చు. అంతేకాదు, కాలుష్యం కారణంగా వివిధ విషపదార్థాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి దీని నుంచి ఉపశమనం పొందడానికి పాదాలకు మసాజ్ చేయడం మంచిది. ఇది శరీరం నుంచి హానికరమైన అంశాలను తొలగిస్తుంది.
గమనిక: ఇందులో అందించిన సాధారణ సమాచారం కోసం మాత్రమే. దయచేసి దీనిని అనుసరించే ముందు నిపుణులను సంప్రదించండి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.