
ఆయుర్వేద ఫేస్ మ్యాపింగ్ లేదా ముఖ పరీక్ష ఒక పురాతన పద్ధతి. అంతర్గత అసమతుల్యతలను గుర్తించడానికి వైద్యులు ముఖాన్ని పరిశీలిస్తారు. ఆధునిక చర్మ వైద్యం చర్మం ఉపరితలంపై దృష్టి పెడుతుంది. ఆయుర్వేదం ముఖం దోషాలు, అంతర్గత అవయవాల సామరస్యాన్ని ప్రతిబింబిస్తుంది అని నమ్ముతుంది. శరీరంలో సమస్యలు ఉన్నప్పుడు, చర్మం రంగు మారడం, మొటిమలు, నిస్తేజం, ముడతలు, వాపు వంటి కనిపించే సంకేతాల ద్వారా ఆ సమస్యలను బయటపెడుతుంది. ఈ పద్ధతి వైద్య నిర్ధారణకు ప్రత్యామ్నాయం కాదు. కానీ ప్రజలు తమ శరీరం ఇచ్చే సంకేతాలను ముందుగానే అర్థం చేసుకోవడానికి, జీవనశైలి మార్పులు చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
ఆయుర్వేదంలో, నుదిటి భాగం వాత దోషానికి సంబంధించినది. ఇది జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. నుదిటిపై మొటిమలు, సన్నని గీతలు, పొడిబారడం లేదా నిస్తేజంగా ఉంటే, అది ఒత్తిడి, సరిగా నిద్ర లేకపోవడం, అస్తవ్యస్తమైన భోజన సమయాలు లేదా అధిక స్క్రీన్ టైమ్ వంటివి సూచిస్తుంది. మలబద్ధకం, అజీర్ణం, డీహైడ్రేషన్ కూడా సాధారణ కారణాలు. వేడి నీళ్లు తాగడం, కెఫిన్ తగ్గించడం, తాజాగా వండిన ఆహారం తీసుకోవడం, వేడి నూనెతో నుదిటిపై మసాజ్ చేసుకోవడం, నిద్ర సరైన సమయానికి ఉండేలా చూసుకోవడం వంటివి సహాయపడతాయి. నుదిటి భాగం నిరంతరం ఇబ్బందిగా ఉంటే, శరీరం విశ్రాంతి కోరుతోంది అని అర్థం.
కనుబొమ్మల మధ్య భాగం పిత్త దోషంతో ముడి ప డి ఉంటుంది. ఇది కాలేయం, భావోద్వేగ ప్రక్రియ, దీర్ఘకాలిక ఒత్తిడి స్థాయిలను సూచిస్తుంది. ఈ ప్రాంతంలో మొటిమలు, ఎరుపు రంగు వస్తే, శరీరంలో వేడి ఎక్కువైందని, ఎక్కువ మద్యం, కారం తిన్నారని, కోపం, నిగ్రహించుకున్న భావోద్వేగాలు ఉన్నాయని అర్థం. కాలేయం విషాన్ని తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి శరీరం అధిక భారాన్ని మోస్తున్నప్పుడు ఇక్కడ సంకేతాలు కనిపిస్తాయి. ఆయుర్వేదం ఈ భాగానికి చల్లబరిచే పద్ధతులు సిఫార్సు చేస్తుంది. అవి: హైడ్రేషన్, ఆకుపచ్చ కూరగాయలు, హెర్బల్ టీలు, ధ్యానం, అధిక వేడికి దూరంగా ఉండటం.
బుగ్గలు శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ, పిత్త-కఫా సమతుల్యతతో అనుసంధానం అయి ఉంటాయి. బుగ్గలపై ఎరుపు, రంగు మారడం, వాపు లేదా తరచూ మొటిమలు వస్తే, గాలి నాణ్యత సరిగా లేకపోవడం, అలెర్జీలు, జీర్ణ వ్యవస్థ బలహీనత లేదా అధిక వేడి ఉన్నట్టు సూచిస్తుంది. బుగ్గలు ఉబ్బినట్టు ఉంటే అది నీరు నిల్వ ఉండటం లేదా కఫా అసమతుల్యతతో ముడి ప డి ఉంటుంది. అధిక ఎరుపు పిత్తా తీవ్రతను సూచిస్తుంది.
ఆయుర్వేదం ప్రాణాయామం, హైడ్రేటెడ్‌గా ఉండటం, చల్లబరిచే ఆహారం తీసుకోవడం, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం వంటివి సిఫార్సు చేస్తుంది.
ఆయుర్వేదంలో ముక్కు గుండె, రక్త ప్రసరణ వ్యవస్థను ప్రతిబింబిస్తుంది. ముక్కు చుట్టూ బ్లాక్‌హెడ్స్, పెద్ద రంధ్రాలు లేదా జిడ్డుగా ఉంటే, రక్త ప్రసరణ సరిగా లేదని, అధిక ఒత్తిడి, లేదా జీవక్రియ మందగించింది అని అర్థం. ముక్కు చుట్టూ ఎరుపు రంగు ఉంటే అంతర్గత వేడి లేదా పిత్తా అసమతుల్యత సంకేతం. ఆయుర్వేదం గుండెకు మేలు చేసే గింజలు (నట్స్), ఓట్స్, ఆకుపచ్చ కూరగాయలు ఆహారంలో చేర్చుకోవాలని, చురుకుగా ఉండాలని, ప్రశాంతమైన శ్వాస పద్ధతులు పాటించాలని సూచిస్తుంది. ఆరోగ్యకరమైన రక్త ప్రసరణ ఈ ప్రాంతంలో రూపాన్ని మెరుగుపరుస్తుంది.
నోరు, గడ్డం, దవడ భాగం హార్మోన్ల ఆరోగ్యం, నిద్ర విధానాలు, కఫా సమతుల్యతతో ముడి ప డి ఉంటాయి. ఈ ప్రాంతంలో మొటిమలు, ముఖ్యంగా పదే పదే గడ్డంపై మొటిమలు వస్తే, హార్మోన్ల హెచ్చుతగ్గులు, ఒత్తిడి సంబంధిత కార్టిసోల్ పెరుగుదల లేదా సరిగా నిద్ర లేకపోవడాన్ని సూచిస్తుంది. దవడ వద్ద ఒత్తిడి భావోద్వేగ ఒత్తిడిని, అణచివేసిన భావాలను లేదా రాత్రిపూట పళ్లు కొరకడాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఆయుర్వేదం శుద్ధి చేసిన చక్కెరలు తగ్గించడం, సరైన నిద్ర ఉండేలా చూసుకోవడం, వేడి హెర్బల్ టీలు తీసుకోవడం, కఫాను సమతుల్యం చేయడానికి చురుకుగా ఉండటం వంటివి సిఫార్సు చేస్తుంది.
నల్లటి వలయాలు, ఉబ్బినట్టు ఉండటం లేదా కళ్లు లోపలికి పోవడం సాధారణంగా వాతా అసమతుల్యత, కిడ్నీల ఆరోగ్యంతో ముడి ప డి ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ భాగం చాలా సున్నితమైంది. ఇది నీటి శాతం, శక్తి నిల్వలు, భావోద్వేగ ఒత్తిడిని వెల్లడిస్తుంది. నిద్ర లేకపోవడం, అధిక ఉప్పు, దీర్ఘకాలిక ఒత్తిడి, డీహైడ్రేషన్, స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడపడం వంటివి కళ్ల కింద సమస్యలకు కారణాలు. ఆయుర్వేదం వేడి నూనె మసాజ్‌లు, సరైన నీటి వినియోగం, దోసకాయ, కొత్తిమీర వంటి చల్లబరిచే ఆహారం, శక్తిని తిరిగి నింపడానికి ప్రాక్టీస్‌లు సిఫార్సు చేస్తుంది.
గమనిక : ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్యుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యకు లేదా చికిత్సకు ముందు తప్పకుండా నిపుణులైన వైద్యుడిని సంప్రదించాలి.