Ayurveda Tips: రాత్రి భోజనంలో ఆ పదార్థాలకు దూరంగా ఉండాలంట.. లేకుంటే ఆరోగ్యం దెబ్బతిన్నట్లే..

|

Aug 29, 2022 | 8:11 PM

సాధారణంగా.. ఉదయం వేళ అల్పాహారం గురించి చాలా స్పృహతో ఉంటాము.. ఎందుకంటే ఖాళీ కడుపుతో అస్సలు ఉండకూడదు. ఇంకా మధ్యాహ్నం ఆకలితో దొరికింది తింటాం.. డిన్నర్ సమయంలో

Ayurveda Tips: రాత్రి భోజనంలో ఆ పదార్థాలకు దూరంగా ఉండాలంట.. లేకుంటే ఆరోగ్యం దెబ్బతిన్నట్లే..
food
Follow us on

Amazing Ayurveda Tips: ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది ఆరోగ్యంపై దృష్టిసారించలేకపోతున్నారు. ఉదయం లేచినప్పటినుంచి.. రాత్రి పడుకునే వరకు బీజీగా ఉండటం వల్ల తీసుకునే ఆహారం విషయంలో అశ్రద్ధ వహిస్తున్నారు. ఇది అస్సలు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఆయుర్వేదం ఎన్నో సూచనలు చేస్తోంది. వాటిని పాటిస్తే.. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సాధారణంగా.. ఉదయం వేళ అల్పాహారం గురించి చాలా స్పృహతో ఉంటాము.. ఎందుకంటే ఖాళీ కడుపుతో అస్సలు ఉండకూడదు. ఇంకా మధ్యాహ్నం ఆకలితో దొరికింది తింటాం.. డిన్నర్ సమయంలో కాస్త ఫ్రీ దొరుకుతుంది. అందుకే ఇష్టం ఉన్న వాటిని తింటాం.. అయితే.. డిన్నర్ రాత్రి నుంచి మొదలుకొని మరుసటి రోజు వరకు ఆరోగ్యాన్ని కాపాడుతుందన్న విషయం అందరికీ తెలుసు. అందుకే డిన్నర్‌ గురించి ఎక్కువ శ్రద్ధ వహించాలి.

ఆయుర్వేదం డిన్నర్ విషయంలో పలు సూచనలు చేస్తోంది. దీనిద్వారా రాత్రి భోజనంలో ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి..? మరుసటి రోజు ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగకుండా ఉండాలంటే.. ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి..? అనే విషయాల గురించి ఒక ఆలోచన వస్తుంది. మీరు రాత్రివేళ తినే ఆహారం.. మరుసటి రోజు జీర్ణక్రియపై ప్రభావాన్ని చూపేలా ఉండకూడదు. ఇలా జరిగితే ఆ రోజంతా చికాకుగా ఉంటుంది. అందుకే అల్పాహారంతో పాటు రాత్రి భోజనం విషయంలోనూ సమానమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయుర్వేదం సూచిస్తోంది. రాత్రి భోజనంలో ఏం తీసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

రాత్రి వేళ భోజనానికి ఇవి ఉత్తమమైనవి..

ఇవి కూడా చదవండి

ఆయుర్వేదం ప్రకారం రాత్రి భోజనంలో తక్కువ కార్బ్ పదార్థాలు తీసుకోవాలి. కరివేపాకు, పసుపు, పప్పు, అల్లం వంటి వాటిని తక్కువ మొత్తంలో తీసుకోవచ్చు. రాత్రి భోజనంలో తేలికపాటి ఆహారాలను తీసుకోవాలన్న విషయాలను గుర్తుంచుకోండి. మీరు రాత్రిపూట భారీ ఆహారాన్ని తీసుకుంటే అది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అలాగే మీ బరువు కూడా పెరుగుతుంది. రాత్రిపూట భోజనం చేసేటప్పుడు తక్కువ తింటేనే బెటర్. దీనిపై ప్రధానంగా శ్రద్ధ వహించాలి.

వీటికి దూరంగా ఉండండి..

ఆయుర్వేదం ప్రకారం ఆయిల్, జంక్ ఫుడ్, స్వీట్లు, చాక్లెట్, నాన్ వెజ్, ఐస్ క్రీం, పెరుగు వంటి చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి. వాస్తవానికి వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో కఫం ఏర్పడి ఆరోగ్యానికి హాని కలుగుతుంది. దీని వల్ల ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు.. అనేక రకాల వ్యాధులను ఎదుర్కోవలసి వస్తుంది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..