కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్యలు ఇప్పుడు 30 ఏళ్లు కూడా నిండని వారిలో కనిపిస్తున్నాయి. కాస్త దూరం నడవగానే మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయి. ఎముకలు అరిగిపోవడం, బలహీనపడడం ఇలా కీళ్ల నొప్పులకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ఇలా కీళ్ల నొప్పులతో బాధపడుతుంటే తీసుకునే ఆహారంలో మార్పుల చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ కీళ్ల నొప్పుల బాధ నుంచి విముక్తి లభించాలంటే ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం..
* కీళ్ల నొప్పులతో బాధపడే వారు వీలైనంత వరకు సోడా, కూల్ డ్రింక్స్ వంటి కార్బోనేటేడ్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కార్బోనేటెడ్ పానీయాలలో ఉండే చక్కెర కంటెంట్ కాల్షియం నష్టానికి దారితీస్తుందని చెబుతున్నారు. దీంతో ఎముకల పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా దంత సమస్యలకు ఇది దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.
* ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా కీళ్ల నొప్పులకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రెంచ్ ఫ్రైస్‌లో ఉండే సోడియం ఎముకల్లోని కాల్షియం కంటెంట్ బలహీనపరుస్తుంది. కాబట్టి సోడియం ఎక్కువగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్, బంగాళదుంప చిప్స్, బర్గర్లు, పిజ్జా లేదా ఏదైనా ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
* కెఫిన్ కూడా ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కెఫిన్ కలిగిన డ్రింక్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. కాబట్టి కాఫీని మితంగా తీసుకోవాలి.
* చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉండే చాక్లెట్లు, క్యాండీలు మన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సహజంగా పెంచుతాయి. దీంతో ఇది ఎముకల సాంద్రతను నేరుగా ప్రభావితం చేస్తుంది. చక్కెర ఎక్కువగా ఉండే.. ఐస్ క్రీం, కేకులు, లడ్డూలు, డెజర్ట్‌లు వంటి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..