
శీతాకాలంలో వేరుశెనగ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి రుచితోపాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. వేరుశెనగ తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వేరుశెనగలో లభించే ఆరోగ్యకరమైన కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచుతాయి. వేరుశెనగలో ఉండే అమైనో ఆమ్లాలు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
వేరుశనగల వల్ల కలిగే ప్రయోజనాలు
రోగనిరోధక శక్తి పెంచుతుంది: శీతాకాలం మనం త్వరగా రోగనిరోధక శక్తిని కోల్పోతాం. దీనివల్ల త్వరగా సీజనల్ వ్యాధుల భారీన పడుతాం. కాబట్టి వేరుశెనగలు తింటే వీటిలో ఉంటే ప్రోటీన్ మనకు శక్తికి అందిస్తుంది. ఇది శరీరాన్ని బలంగా, చురుకుగా ఉంచుతుంది. అలాగే ఇందులో ఉండే రెస్వెరాట్రాల్, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.
బరువు నియంత్రంణ: వేరుశెనగలో కేలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ, మితంగా తీసుకుంటే, అవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. వేరుశెనగలోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ఎక్కువసేపు కడుపు నిండినట్లు ఉంచుతుంది, తద్వారా బరువు పెరగడానికి ప్రధాన కారణమైన అతిగా తినడం నివారిస్తుంది.
పల్లీలు తినేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పల్లీలు మన ఆరోగ్యానికి మేలు చేసినవే అయినప్పటికీ.. వాటిని తీసుకునే విధానంలో మార్పులు వస్తే అవి హానికరంగా మారొచ్చు. అవును ఎక్కువగా వేరుశెనగలు తినడం వల్ల బరువు పెరగడం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల, శీతాకాలంలో మీరు ప్రతిరోజూ ఒక చిన్న గుప్పెడు వేరుశెనగలు మాత్రమే తినండి. వేరుశెనగ అలెర్జీలు ఉన్నవారు వాటి జోలికి అస్సలు వెళ్లకండి.
పల్లీలను డ్రీప్రై చేయకండి
అలాగే చాలా మంది టేస్ట్ కోసం పల్లీలను వేయించుకొని, ఉప్పు, కారం కలుపుకొని తింటారు. ఇలా చేడం వల్ల వాటిని పూర్తి ప్రయోజనాలను పొందలేరు. ఈ ప్రక్రియ శరీరంలో అధిక ఉప్పు రక్తపోటును పెంచుతుంది. వేరుశెనగలను డీప్-ఫ్రై చేయడం వల్ల వాటి పోషక విలువలు తగ్గుతాయి. కాబట్టి శనగలను నార్మల్‌గా లేదా ఉడికించి తినడం ఉత్తమం. సరైన పద్ధతిలో, సరైన సమయంలో తీసుకుంటే, వేరుశెనగలు మీ శీతాకాలపు ఆహారంలో ఆరోగ్యకరమైన, పోషకమైన ఎంపికగా మారుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.