Processed Food: రుచిగా ఉన్నాయని వీటిని అదేపనిగా తింటే.. ఆస్తమా, క్యాన్సర్ ఇంకా..

అతిగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగింది. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ ఆహారాలను తెగ లాగించేస్తున్నారు. ఈ ధోరణి ఆరోగ్య నిపుణులలో ఆందోళనలను రేకెత్తిస్తుంది. నేటి కాలంలో చిప్స్, బర్గర్, పిజ్జా వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం అలవాటై పోయింది..

Processed Food: రుచిగా ఉన్నాయని వీటిని అదేపనిగా తింటే.. ఆస్తమా, క్యాన్సర్ ఇంకా..
Ultra Processed Food

Updated on: May 19, 2026 | 1:07 PM

చిప్స్, ప్యాకెట్ స్నాక్స్, ఇన్‌స్టంట్ నూడుల్స్, బర్గర్లు, పిజ్జా, స్వీట్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకునే పిల్లలకు ఆస్తమా సహా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తాజా పరిశోధనలో తేలింది. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం ఎందుకు ప్రమాదకరమో, ఆస్తమాకు దీనికీ ఉన్న సంబంధం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం ఎందుకు ప్రమాదకరం?

అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం కడుపు ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, శరీరంలోని ‘గట్ మైక్రోబయోమ్’పై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది రోగనిరోధక వ్యవస్థను బలహీనపరిచి, శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతుంది. ఈ ప్రభావం ఊపిరితిత్తులపై పడి, ఆస్తమా ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇలాంటి ఆహారాలలో అధిక మొత్తంలో రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ రుచులు, ఇతర పదార్థాలు ఉంటాయి. ఇవి పిల్లల శరీర అభివృద్ధికి హానికరంగా ఉంటాయి. కడుపు సంబంధిత సమస్యలు, జీర్ణ సమస్యలు, దీర్ఘకాలంలో క్యాన్సర్ ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉందని ఈ అధ్యయనం చూపిస్తుంది.

పిల్లల ఆహార అలవాట్లలో ఎలాంటి మార్పులు అవసరం?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పిల్లలకు తాజా పండ్లు, కూరగాయలు, ఇంట్లో వండిన ఆహారం, పప్పులు, పాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినిపించడం ఉత్తమం. అలాగే తృణధాన్యాలతో చేసిన ఆహారాలు, తక్కువ చక్కెర ఉన్న ఆహార పదార్థాలను తినేలా ఎక్కువగా ప్రోత్సహించాలి. పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్యాకెట్ ఫుడ్, జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించడం చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నోట్‌: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. టీవీ9 నిర్ధారించడం లేదు. ఇతర వివరాలకు ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us