AC Effects: రాత్రంతా ఏసీ ఆన్‌లో పెట్టి పడుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి!

ఎండ వేడికి, ఉక్క పోత కారణంగా ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఈ వేడిని తట్టుకోలేక ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఎక్కువగా చాలా మంది ఏసీలనే కొనుక్కంటున్నారు. ఎండ వేడిని తట్టుకునేందుకు ఎయిర్ కండీషనర్ చక్కగా పని చేస్తుంది. ఇదే క్రమంలో రాత్రంతా ఏసీలను ఆన్ చేసి నిద్రపోయే వారు చాలా మంది ఉన్నారు. ఇలా రాత్రంతా ఏసీలను ఆన్‌లో ఉంచి నిద్రపోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు..

AC Effects: రాత్రంతా ఏసీ ఆన్‌లో పెట్టి పడుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి!
AC Effects
Follow us

|

Updated on: Apr 18, 2024 | 11:56 AM

ఎండ వేడికి, ఉక్క పోత కారణంగా ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఈ వేడిని తట్టుకోలేక ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఎక్కువగా చాలా మంది ఏసీలనే కొనుక్కంటున్నారు. ఎండ వేడిని తట్టుకునేందుకు ఎయిర్ కండీషనర్ చక్కగా పని చేస్తుంది. ఇదే క్రమంలో రాత్రంతా ఏసీలను ఆన్ చేసి నిద్రపోయే వారు చాలా మంది ఉన్నారు. ఇలా రాత్రంతా ఏసీలను ఆన్‌లో ఉంచి నిద్రపోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎయిర్ కండీషన్ ఆన్‌లో ఉంచుకుని నిద్ర పోవడం వల్ల చల్లగా ఉంటుంది. దీని వల్ల చక్కగా నిద్ర పడుతుంది. అలాగే అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం.

శ్వాస కోశ సమస్యలు:

ఏసీని రాత్రంతా ఆన్ చేసి నిద్ర పోవడం వల్ల శ్వాస కోశ సమస్యలు రావచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు. చలి గాలి వల్ల అలెర్జీలు, ఉబ్బం, దగ్గు, గురక, ఛాతీ బిగుతుగా మారడం, ఊపిరి ఆకపోవడం వంటి లక్షణలు కనిపిస్తాయి. ఇవే లక్షణాలు అందరిలో ఉండాలని లేదు. ఏసీలోని గాలి వల్ల కాలుష్య కారఖాలు కూడా ఉండవచ్చు. అంతే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది.

కళ్లు పొడిబారి పోతాయి:

ఏసీలో ఎక్కువగా ఉండటం వల్ల కళ్లు అనేవి పొడి బారి పోతాయి. దీంతో కళ్ల సమస్యలు రావచ్చు. కళ్లు మసక బారిపోవడం, కళ్లు ఎరుపెక్కడం, దురదలు రావడం, సరిగా కనిపింక పోవడం వంటి కంటి సమస్యలు రావచ్చు.

ఇవి కూడా చదవండి

చర్మ సమస్యలు:

ఏసీలో ఎక్కువగా ఉండటం వల్ల చర్మ సమస్యలు కూడా వస్తాయి. ఏసీ వల్ల ముఖ్యంగా అలెర్జీలు వస్తాయి. చర్మంపై దద్దర్లు, దురద, మచ్చలు, స్కిన్ పొడి బారిపోవడం, కాంతిని కోల్పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఏసీలో ఎక్కువ సేపు ఉండటం సేఫ్ కాదు.

కీళ్ల నొప్పులు:

ఏసీలో ఎక్కువగా ఉండటం వల్ల కీళ్ల నొప్పులు కూడా రావచ్చు. చల్లని గాలి వల్ల కండరాల దృఢత్వం పెరిగిపోతుంది. అలాగే కండరాలు సంకోచించి.. బిగుతుగా మారిపోతాయి. ఇవి అసౌకర్యంగా ఉంటాయి. అలాగే అర్థరైటీస్ సమస్యలు కూడా రావచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. పరీక్షలు వాయిదా!
ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. పరీక్షలు వాయిదా!
ఓట్ల పండుగ ఎలా జరుగుతుంది..? భారత్ చేరుకున్న విదేశీ నేతలు..
ఓట్ల పండుగ ఎలా జరుగుతుంది..? భారత్ చేరుకున్న విదేశీ నేతలు..
చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎందుకు స్పందించదు? - పోసాని
చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎందుకు స్పందించదు? - పోసాని
ఓపెనర్లుగా అరవీర భయంకరులు.. మిడిలార్డర్‌లో పించ్ హిట్టర్లు.!
ఓపెనర్లుగా అరవీర భయంకరులు.. మిడిలార్డర్‌లో పించ్ హిట్టర్లు.!
ప్రపంచంలో లక్కి పర్సన్.. 30 ఏళ్ళ పాటు నెలా కోటి రూపాయల బహుమతి
ప్రపంచంలో లక్కి పర్సన్.. 30 ఏళ్ళ పాటు నెలా కోటి రూపాయల బహుమతి
వామ్మో..పెళ్లి పందిట్లోనే ప్రతాపం చూపించిన వరుడు..! షాక్ లో వధువు
వామ్మో..పెళ్లి పందిట్లోనే ప్రతాపం చూపించిన వరుడు..! షాక్ లో వధువు
మూడు జిల్లాల్లో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం
మూడు జిల్లాల్లో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం
నాకు ఇష్టమైన నటుడు.. ఎన్టీఆర్ ఫోటోస్ వైరల్..
నాకు ఇష్టమైన నటుడు.. ఎన్టీఆర్ ఫోటోస్ వైరల్..
రెండేళ్లలో నల్లపు నుంచి తెల్లగా మారిన శునకం.. కారణం తెలిస్తే షాక్
రెండేళ్లలో నల్లపు నుంచి తెల్లగా మారిన శునకం.. కారణం తెలిస్తే షాక్
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. వచ్చే 4 రోజులు మాడు పగిలే ఎండలు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. వచ్చే 4 రోజులు మాడు పగిలే ఎండలు