Parenting Tips: మీ పిల్లలకు Crocs వేస్తున్నారా..? అయితే మీకో షాకింగ్ న్యూస్..!

ఈ మధ్య చిన్న పిల్లలు వేసుకునే చెప్పుల్లో Crocs (క్రాక్స్) బాగా ట్రెండ్ అయ్యాయి. పసిపిల్లలు కూడా వీటిని వేసుకోవడం స్టైల్‌గా చూస్తున్నారు. ముఖ్యంగా 2 నుండి 4 సంవత్సరాల పిల్లలు ఈ షూస్‌ను ఎక్కువగా వాడుతున్నారు. మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తుంటే.. ఈ సమాచారం మీకు చాలా ఉపయోగపడుతుంది.

Parenting Tips: మీ పిల్లలకు Crocs వేస్తున్నారా..? అయితే మీకో షాకింగ్ న్యూస్..!
Kids With Crocs

Updated on: Jul 25, 2025 | 10:57 PM

కాలం మారినట్టుగానే మన దుస్తుల సెలక్షన్ లాగే షూస్ ఎంపికల్లో కూడా మార్పులు వస్తున్నాయి. గతంలో మామూలుగా రోజువారీ అవసరాలకు ఎక్కువ శబ్దం చేసే మామూలు చెప్పులు, షూస్ వాడేవారు. కానీ ఇప్పుడు క్రాక్స్ ఒక స్టైల్ ఐటమ్ అయిపోయాయి. వీటిని మార్కెట్లలో, షాపింగ్ మాల్స్‌లో, పెద్దలు, పిల్లలు అందరూ వేసుకుంటూ కనిపిస్తున్నారు. వీటి మెత్తని రూపం, సౌకర్యం వీటిని ప్రత్యేకంగా చేశాయి. అందుకే చిన్న పిల్లలు కూడా వీటినే ఫస్ట్ ఛాయిస్‌ గా తీసుకుంటున్నారు.

అయితే చిన్న పిల్లలకు ఇవి మంచివేనా..? ముఖ్యంగా వయస్సు పెరుగుతున్నప్పుడు వారి పాదాల ఎదుగుదలకు ఈ క్రాక్స్ ఉపయోగపడతాయా అనే అనుమానం తల్లిదండ్రులకు రావాలి. ఈ విషయంలో నిపుణులు కొన్ని ముఖ్యమైన విషయాలు చెబుతున్నారు.

పిల్లలకు Crocs ఎందుకు మంచివి కావు..?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. క్రాక్స్‌లో పాదాలకు కావాల్సిన ఆర్చ్ సపోర్ట్ ఉండదు. అంటే పాదాల మధ్య భాగాన్ని ఇవి సరిగా సపోర్ట్ చేయలేవు. పిల్లల పాదాలు ఈ వయసులో ఎదుగుతాయి. వాటికి సరైన ఆకృతి వచ్చేందుకు మంచి సపోర్ట్ కావాలి. ఈ సపోర్ట్ లేకపోతే వారి కాలి శక్తి సరిగా పెరగదు. దీని వల్ల ఫ్లాట్ ఫీట్, మడమ నొప్పి లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

క్రాక్స్ చాలా వదులుగా ఉంటాయి. పిల్లలు ఎప్పుడూ ఆడుకుంటూ, పరిగెత్తుతూ ఉంటారు. అలాంటి సమయంలో ఇవి కాలి నుండి ఈజీగా జారిపోతాయి. ఎగిరి దూకేటప్పుడు చెప్పులు పడిపోవడం వల్ల కాలు విరిగే ప్రమాదం, గాయాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

క్రాక్స్ తయారీలో ఫోమ్ లేదా రబ్బర్ వాడతారు. ఇవి మెత్తగా అనిపించినా సరైన కుషన్ సపోర్ట్ ఇవ్వవు. పిల్లలు ఎక్కువసేపు వీటిని వేసుకుంటే కాళ్లకు నొప్పి రావచ్చు లేదా తొందరగా అలసిపోయినట్లు అనిపించవచ్చు. ఎదుగుతున్న వారి పాదాలకు శరీర బరువును సమానంగా పంచే.. సౌకర్యం ఇచ్చే షూస్ అవసరం.

మరొక విషయం ఏమిటంటే.. వేసవిలో క్రాక్స్ వేసుకుంటే వీటిలో వాడే మెటీరియల్ వల్ల చెమట ఎక్కువగా వస్తుంది. ఇది బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతుంది. ఇలా అయితే ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే.

క్రాక్స్ వెనుక భాగంలో స్ట్రాప్ ఉన్నా.. పిల్లల మడమల నుండి జారిపోవచ్చు. ఇది కాలి వేళ్ళపై ఒత్తిడిని పెంచుతుంది. దీని వల్ల వారు నడిచినప్పుడు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దీని కారణంగా పాదల నొప్పులు, అలసట లాంటి సమస్యలు వస్తాయి.

అయితే అప్పుడప్పుడు క్రాక్స్ వేసుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ప్రతిరోజూ అవే వేసుకోవడం సరైన పద్ధతి కాదు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సరిగ్గా పట్టే.. సపోర్ట్ ఇచ్చే షూస్ ఎంచుకునేలా చూడాలి. ఇది వారి భవిష్యత్తులో పాదాలు ఆరోగ్యంగా ఎదగడానికి సహాయపడుతుంది.