Apple Cider Vinegar Side Effects: ఖాళీ కడుపుతో ఆపిల్ సైడర్ వెనిగర్ తాగుతున్నారా..? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి..

|

Apr 13, 2024 | 9:48 AM

ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. చర్మం, జుట్టు సంరక్షణ కోసం ఉపయోగిస్తారు. అయితే ఆపిల్ సైడర్ వెనిగర్ వల్ల ప్రయోజనాలే కాకుండా.. దుష్ర్పభావాలు కూడా ఉన్నాయని తెలిస్తే మీరు షాక్‌ అవుతారు. దీనిని తరచుగా ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎదురవుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

Apple Cider Vinegar Side Effects: ఖాళీ కడుపుతో ఆపిల్ సైడర్ వెనిగర్ తాగుతున్నారా..? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి..
Apple cider Vinegar
Follow us on

బరువు తగ్గడం నుంచి చర్మం, జుట్టు సంరక్షణ వరకు ఆపిల్ సైడర్ వెనిగర్ వాడకం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే. ఆపిల్ సైడర్ వెనిగర్(ACV) ఆపిల్ జ్యూస్ ఈస్ట్‌తో కలిపి పులియబెట్టి తయారు చేస్తారు. ఎక్కువగా డ్రెస్సింగ్, మెరినేడ్స్, పచ్చళ్ళలో వాడుతుంటారు. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. చర్మం, జుట్టు సంరక్షణ కోసం ఉపయోగిస్తారు. అయితే ఆపిల్ సైడర్ వెనిగర్ వల్ల ప్రయోజనాలే కాకుండా.. దుష్ర్పభావాలు కూడా ఉన్నాయని తెలిస్తే మీరు షాక్‌ అవుతారు. దీనిని తరచుగా ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎదురవుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు ఎక్కువగా ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ వాడుతుంటారు. దీంతో బరువు తగ్గటమే కాదు..రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయినప్పటికీ, దాని అధిక వినియోగం కొన్ని షాకింగ్ దుష్ప్రభావాలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆపిల్‌ సైడర్‌వెనిగర్‌ అధిక వినియోగం జీర్ణకోశ సమస్యలకు కారణం కావచ్చు. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆహార శోషణ ప్రక్రియ మందగిస్తుంది. ఇది జీర్ణశయాంతర సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. జీర్ణ సంబంధ సమస్యలకు కారణం కావచ్చు అంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆపిల్ సైడర్ వెనిగర్ మీకు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీంతో సహజంగా ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. ఇది కొన్ని సార్లు వికారానికి దారితీసే అవకాశం ఉంటుంది. దంత క్షయానికి కారణం కావచ్చు. ఇది చాలా ఆమ్లంగా ఉంటుంది. అధికంగా తీసుకుంటే పంటి ఎనామిల్ దెబ్బతింటుంది.

ఆపిల్‌ సైడర్‌ వెనిగిర్‌ అధిక వినియోగంతో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు. అధ్యయనాల ప్రకారం, ఆపిల్ సైడర్ వెనిగర్ యాంటీ-గ్లైసెమిక్ ప్రభావాన్ని కలిగి ఉంది. ఇది గ్లూకోజ్ స్థాయిలలో అసమతుల్యతను కలిగిస్తుంది. గొంతు మంటలకు కారణం కావచ్చు. ఎసిటిక్ ఆమ్లం అధిక స్థాయిలు గొంతు చికాకు, మండే అనుభూతికి దారితీయవచ్చు. చర్మం కాలిన గాయాలకు కారణం కావచ్చు. చర్మానికి నేరుగా అప్లై చేయటం వల్ల బలమైన యాసిడ్ స్థాయిల కారణంగా చర్మం కాలిన గాయాలు, చికాకు కలిగించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇందులో ఉండే తక్కువ క్యాలరీ కంటెంట్ సంతృప్తినిచ్చే పానీయంగా సరిపోదు. అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అసమతుల్యత ఏర్పడి, అలసటగా ఉంటుంది. అలాగే, నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు మందులు తీసుకుంటుంటే, యాపిల్ సైడర్ వెనిగర్ వినియోగం గ్యాస్ట్రోపెరేసిస్‌కు దారితీస్తుందని చెబుతున్నారు. ఇది జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుంది. కొన్ని ఔషధాల ప్రభావాన్ని తగ్గిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…