Apple Vinegar: ఆపిల్‌ వెనిగర్‌ ఈ 5 సమస్యలకు చక్కటి పరిష్కారం..! అవేంటో తెలుసుకోండి..

Apple Vinegar: ఆపిల్ సైడర్ వెనిగర్ చాలా సంవత్సరాలుగా వంట పదార్థంగా ఉపయోగిస్తున్నారు. కానీ నేటికీ చాలా మందికి దాని

Apple Vinegar: ఆపిల్‌ వెనిగర్‌ ఈ 5 సమస్యలకు చక్కటి పరిష్కారం..! అవేంటో తెలుసుకోండి..
Apple Vinegar

Updated on: Aug 25, 2021 | 1:27 PM

Apple Vinegar: ఆపిల్ సైడర్ వెనిగర్ చాలా సంవత్సరాలుగా వంట పదార్థంగా ఉపయోగిస్తున్నారు. కానీ నేటికీ చాలా మందికి దాని ప్రయోజనాల గురించి తెలియదు. ఇది ఆమ్ల లక్షణాలను కలిగి ఉంటుంది. నీటితో కలిపి వాడటం ద్వారా దీనిని వినియోగించాలి. ఆపిల్ సైడర్ వెనిగర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది కాకుండా చర్మం, జుట్టు సమస్యను వదిలించుకోవడానికి దీనిని ఉపయోగిస్తారు. ఇంకా చాలా సమస్యలకు పరిష్కారం. అవేంటో తెలుసుకుందాం.

1. చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది
అనేక అధ్యయనాలు యాపిల్ సైడర్ వెనిగర్ డయాబెటిక్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. ఇది శరీరంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. కానీ దీనిని ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించాలి. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని 19 నుంచి 34 శాతం పెంచడానికి పనిచేస్తుంది.

2. బరువు తగ్గడంలో సహాయపడుతుంది
ఆపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది మీ ఆకలిని అదుపులో ఉంచుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పొట్ట ఎక్కువ కాలం నిండుగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనిలో కేలరీల పరిమాణం చాలా తక్కువ. ఒక చెంచా వెనిగర్‌లో 3 కేలరీలు ఉంటాయి అంటే దీనిని తినడం వల్ల కొవ్వు పెరగదు.

3. గొంతు నొప్పి నుంచి ఉపశమనం
యాపిల్ సైడర్ వెనిగర్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీని అర్థం మీరు దీనిని సేంద్రీయ మౌత్ వాష్‌గా ఉపయోగించవచ్చు. ఇది నోటి దుర్వాసనను తొలగిస్తుంది. కావిటీస్ నివారించడంలో సహాయపడుతుంది. ఇది ఆమ్లంగా ఉంటుంది కనుక నీటిని కలిపి వాడాలని తెలుసుకోండి.

4. గుండెకు మంచిది
అనేక కారణాల వల్ల గుండె జబ్బులు సంభవించవచ్చు అయితే ఆపిల్ సైడర్ వెనిగర్ ఈ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే ఇది నిర్ధారించబడలేదు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది జంతువులలో ట్రైగ్లిజరైడ్, కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. దీని అర్థం ఇది మానవ హృదయానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని కొంతమంది అభిప్రాయం.

5. పండ్లు, కూరగాయలను బాగా కడుగుతుంది
చాలా పండ్లు, కూరగాయలపై పురుగుమందులను ఉపయోగిస్తారు. నీరు మాత్రమే పండ్ల విషాన్ని శుభ్రం చేయదు. అందువల్ల యాసిడ్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో కూడిన ఆపిల్ సైడర్ వెనిగర్‌తో కడిగితే చాలా మంచిది. కోలి, సాల్మోనెల్లా వంటి వాటిని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

Viral Video: అదృష్టమంటే ఈ కుటుంబానిదే.. ఓ క్షణం అటు, ఇటు అయినా పరిస్థితి వేరేలా ఉండేది. భయానక వీడియో.

ఈ 2 రాశుల వారికి సెప్టెంబర్‌లో కష్టాలు తప్పవు..! మీరు అందులో ఉన్నారా చెక్ చేసుకోండి..

Manchu Vishnu: మోహన్ బాబు వస్తున్నారని తెలిసి.. రెస్టారెంట్ బ్యాక్ డోర్ నుంచి పారిపోయిన విష్ణు.. లవ్ స్టోరీలో ఎన్నో ట్విస్టులు