అన్ని విషయాలలో కోపం సమస్యలను పరిష్కరించదు. పైగా సమస్యను మరింత క్లిష్టంగా మారుస్తుంది. చిన్న చిన్న విషయాలకే కోపగించుకునేవారు నిత్యం మన కళ్ల ముందు చాలా మందే ఉంటారు. అయితే, ఆ కోపంతో ఏం సాధించగలం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. కోపం పెరిగడం వల్ల తమను తాము నియంత్రించుకోలేని పరిస్థితి వస్తుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఫలితంగా.. స్నేహితులు, బంధువులు కూడా వారి నుండి నెమ్మదిగా దూరం అవుతుంటారు. అందుకే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీ ప్రవర్తన కూడా ఇటీవల దూకుడుగా మారుతోందా? అయితే, ఇవి తప్పకుండా తెలుసుకోండి..
అసలు కొపం ఎందుకు వస్తుందో అర్థం చేసుకోవాలి. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేయాలనే దానిపై ఆలోచించాలి. కొంత సమయం ఒంటరిగా గడపాలి. కోపానికి గల కారణాన్ని కనిపెట్టి, పరిష్కారమార్గాన్ని తెలుసుకోవచ్చు. మీరైనా, మీ సన్నిహితులెవరైనా అధిక కోపంతో ఊగిపోతున్నట్లయితే.. వారితో మాట్లాడి సమస్యను పరిస్కరించడానికి ప్రయత్నించండి.
1. ఊహించుకోవద్దు. చాలా సందర్భాలలో ఒక వ్యక్తి తప్పుడు ఆలోచనే వారి కోపానికి దారి తీస్తుంది. దాని కారణంగా వారు దూకుడుగా ప్రవర్తించడం చేస్తుంటారు. అందుకే ఏ విషయమైనా లోతుగా తెలుసుకోకుండా, ఏది ఒప్పు? ఏది తప్పు? అర్థం చేసుకోకుండా ప్రతిస్పందించడం మానుకోవాలి. కొన్నిసార్లు ఈ ఊహాగానాలు అపార్థాలకు దారితీస్తాయి.
2. విస్మరించడం ప్రారంభించాలి. కోపానికి కారణమయ్యే అంశాన్ని వదిలెయ్యాలి. వాటి గురించి ఆలోచించడం, వాటిపై శ్రద్ధ చూపడం వంటివి చేయొద్దు. కోపం వచ్చే పరిస్థితి ఉంటే.. ఆ కోపాన్ని డైవర్ట్ చేయండి. కొన్ని సృజనాత్మక పనుల్లో పూర్తిగా నిమగ్నమైపోవాలి. ఇది ఒక మానసిక వ్యాయామం. మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడానికి, కోపాన్ని తొలగించి మనసు ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.
3. కొన్ని రోజులు వెకేషన్‌కు వెళ్లొచ్చు. వాతావరణ మార్పులు కూడా ప్రవర్తనపై ప్రభావం చూపుతాయి. ఎప్పుడైనో కోపం, ప్రస్టేషన్, ఇతర సమస్యలుంటే.. ప్రశాంతమైన వాతావరణం ఉండే ప్రదేశాలకు వెళ్లి సమయం గడపవచ్చు.
4. ధ్యానం చేయాలి. చిన్న చిన్న విషయాలకు కోపం వస్తున్నట్లయితే.. ఆ కోపాన్ని అదుపులోకి తెచ్చుకునేందుకు ధ్యానం చేయడం ఉత్తమం. లేదంటే ఏదైనా రిలాక్సింగ్ కార్యకలాపాలు చేయాలి. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి, సమస్యల గురించి మరింత స్పష్టమైన అవగాహన పొందడానికి సహాయపడుతుంది. ధ్యానం చేయడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవచ్చు.
5. క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. ఎవరిపైనైనా కోపంగా ఉంటే.. వారిని మరిచిపోయేందుకు ప్రయత్నించండి. వారి చర్యపై స్పందించి, మరింత కోపం తెచ్చుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. అందుకే.. మీ కోపానికి కారణమయ్యే వారిని క్షమించి వదిలెయ్యండి.
లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..