వీటిని గుర్తుపట్టారా..? రోజూ నీళ్లలో నానబెట్టి తిన్నారంటే పుట్టెడు లాభాలు

ఆరోగ్యానికి చాలా మేలు చేసే ఆహారాల్లో వాల్‌నట్స్ ముందు వరుసలో ఉంటాయి. అంతే కాదు వీటిని తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు కూడా అంటున్నారు. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో వీటిని తినడం ద్వారా ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం..

వీటిని గుర్తుపట్టారా..? రోజూ నీళ్లలో నానబెట్టి తిన్నారంటే పుట్టెడు లాభాలు
Walnuts

Updated on: Jul 17, 2025 | 12:20 PM

వాల్‌నట్స్ గురించి తెలియనివారుండరు. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంతే కాదు వీటిని తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు కూడా అంటున్నారు. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో వీటిని తినడం ద్వారా ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వాల్‌నట్స్‌లోని విటమిన్లు డయాబెటిస్, బరువు తగ్గడం, ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందుకే ప్రతిరోజూ వాల్‌నట్‌లను నానబెట్టి తినడం మంచిది. వాల్‌నట్స్‌ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో.. వీటిని ఎందుకు తినాలో ఇక్కడ తెలుసుకుందాం..

గుండె ఆరోగ్యం

వాల్‌నట్స్‌లో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతే కాదు. వాల్‌నట్స్‌లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి.

క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది

వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు మెదడు పనితీరును పెంచి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. రోజుకు రెండు వాల్‌నట్స్ తినడం వల్ల వాటిలో ఉండే యాంటీఆక్సిడెంట్ల కారణంగా కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.

ఇవి కూడా చదవండి

బరువు తగ్గడంలో సహాయపడుతుంది

వాల్‌నట్స్ ఫైబర్, ప్రోటీన్‌లకు మంచి మూలం. ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

చర్మ ఆరోగ్యం

వాల్‌నట్స్‌లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో వాల్‌నట్స్ తినడం జీర్ణవ్యవస్థకు మంచిది. అంతే కాదు, వాల్‌నట్స్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముడతలను తగ్గిస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో 2 నానబెట్టిన వాల్‌నట్స్ తినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.