Horse Gram Uses: ఉలవలు చేసే మేలు అంతా ఇంతా కాదు.. అస్సలు మర్చిపోకుండా తీసుకోండి!

|

Mar 16, 2024 | 1:13 PM

ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఉలవలు కూడా ఒకటి. ఉలవలు ఒక ప్రత్యేకమైన ధాన్యంగా చెప్పొచ్చు. చాలా మందికి వీటికి గురించి పెద్దగా తెలీదు. కేవలం ఉలవచారు, ఉలవచారు బిర్యానీ మాత్రమే తిని ఉంటారు. ఉలవల్లో చాలా పోషకాలు నిండి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉలవల్లో తెల్లవి, నల్లవి అనే రెండు రకాలు ఉంటాయి. తెల్ల ఉలవలను వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. నల్ల ఉలవలను ఔషధ ప్రయోజనాల..

Horse Gram Uses: ఉలవలు చేసే మేలు అంతా ఇంతా కాదు.. అస్సలు మర్చిపోకుండా తీసుకోండి!
Horse Gram Uses
Follow us on

ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఉలవలు కూడా ఒకటి. ఉలవలు ఒక ప్రత్యేకమైన ధాన్యంగా చెప్పొచ్చు. చాలా మందికి వీటికి గురించి పెద్దగా తెలీదు. కేవలం ఉలవచారు, ఉలవచారు బిర్యానీ మాత్రమే తిని ఉంటారు. ఉలవల్లో చాలా పోషకాలు నిండి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉలవల్లో తెల్లవి, నల్లవి అనే రెండు రకాలు ఉంటాయి. తెల్ల ఉలవలను వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. నల్ల ఉలవలను ఔషధ ప్రయోజనాల కోసం వాడతారు. మరి ఉలవలతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉలవల్లోని పోషకాలు:

ఉలవల్లో ఐరన్, జింక్, ఫోలేట్, మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్పరస్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు బీ1. బీ2, బీ6, సీ, ఇ వంటివి పుష్కలంగా లభిస్తాయి.

చర్మం ఆరోగ్యం:

ఉలవల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. కాబట్టి ఇవి తినడం వల్ల దెబ్బతిన్న చర్మ కణాలు రక్షించడానికి, ముడతలు, మొటివలు నివారించడానికి సహాయ పడతాయి. ఉలవలు తింటే.. వృద్ధాప్యం త్వరగా దరి చేరకుండా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

క్యాన్సర్ నివారణ:

ఉలవలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉలవల్లోని యాంటీ ఆక్సిడెంట్లు.. క్యాన్సర్ కణాల ఏర్పాటును నిరోధించడంలో హెల్ప్ చేస్తాయి.

రక్త హీనత:

రక్త హీనత సమస్యతో బాధ పడుతూ ఉన్నట్లయితే.. ఉలవలు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఉలవల్లో జింక్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి.. రక్త హీనత సమస్య నుంచి బయట పడొచ్చు.

ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి:

ఉలవల్లో క్యాల్షియం కూడా లభిస్తుంది. కాబట్టి ఉలవలు తినడం వల్ల ఎముకలు కూడా బలంగా ఉంటాయి. ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని కూడా తగ్గించేందుకు హెల్ప్ అవుతుంది.

వెయిట్ లాస్ అవుతారు:

ఉలవల్లో ప్రోటీన్, ఫైబర్ అనేవి లభిస్తాయి. ఇవి కొద్దిగా తిన్నా.. కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి అధిక ఆహారం తీసుకునేందుకు అవకాశం ఉండదు. అంతే కాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. కాబట్టి వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా ఇవి హెల్ప్ చేస్తాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..