
పండ్లలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. వీటిని తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు.. ముఖ్యంగా.. శీతాకాలంలో లభించే పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. అలాంటి పండ్లలో జామకాయ ఒకటి.. శీతాకాలంలో జామ పండు తినడం మంచిది.. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండులో విటమిన్ సి, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. జామ పండులో అరటిపండు కంటే ఎక్కువ పొటాషియం, 5 గ్రాముల ఫైబర్, 3 గ్రాముల ప్రోటీన్ ఉంటాయి. ఈ పండు సాధారణంగా ప్రతిచోటా లభిస్తుంది.. అన్ని సీజన్లలో జామపండ్లు లభిస్తున్నప్పటికీ.. శీతాకాలంలో ఎక్కువగా లభిస్తాయి.. అంతేకాకుండా చౌకగా కూడా ఉంటాయి.. సాధారణంగా ఒక జామకాయ రూ.5 లేదా 10 కి లభిస్తుంది.. ఇంకా కేజీ రూ.50 వరకు లభిస్తాయి.. అయితే.. నాణ్యతను బట్టి కూడా ధర ఉంటుంది. శీతాకాలంలో అన్ని ప్రాంతాల్లో జామపండ్లు లభిస్తాయి..
జామ పండు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
జామ ఆకులు ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తాయి. జామ ఆకుల టీ తాగడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులలో భోజనం తర్వాత చక్కెర స్థాయిలు 10 శాతం తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇంకా జామపండ్లు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. యాంటీఆక్సిడెంట్లు గుండెను ఫ్రీ రాడికల్ నష్టం నుండి రక్షిస్తాయి.
జామపండ్లు కొలెస్ట్రాల్, రక్తపోటును కూడా తగ్గిస్తాయి. వీటిలోని ఫైబర్ కంటెంట్.. బరువును తగ్గేలా చేస్తుంది.
జామపండ్లు ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీర్ణక్రియ, ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తాయి. ఈ పండులోని ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇంకా కడుపును ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.
జామపండును ఎలాగైనా తినొచ్చు.. అల్పాహారంగా లేదా భోజనం తర్వాత జామపండును తినవచ్చు.. ఇంకా స్నాక్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు.. ఇంకా జ్యూస్ చేసుకుని కూడా తాగొచ్చు..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..