వారెవ్వా.. శొంఠితో ఇన్ని లాభాలా..? ఆరోగ్య అద్భుతాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

మీరు కూడా చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబులను నివారించాలనుకుంటే మీ వంటగదిలో సులభంగా లభించే సోంఠిని ఉపయోగించవచ్చు. అల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందో సోంఠి కూడా అంతే ఆరోగ్యకరమైనది. దీనిలో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, సోడియం, విటమిన్లు ఎ, సి, జింక్, ఫోలేట్, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. పాలు, టీలో డ్రై జింజర్‌ను ఉపయోగించడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు.

వారెవ్వా.. శొంఠితో ఇన్ని లాభాలా..? ఆరోగ్య అద్భుతాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
Dry Ginger

Updated on: Nov 10, 2025 | 1:40 PM

శొంఠిలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా సీజ‌న‌ల్ వ్యాధుల‌ను నివారించ‌డంలో శొంఠి అద్భుతంగా పనిచేస్తుంది. జలుబు చేసినప్పుడు శొంఠి పొడిని నీళ్లలో కలిపి మరగబెట్టి తాగితే ఉపశమనం కలిగిస్తుంది. అలాగే మరుగుతున్న టీ లేదా కాఫీలో శొంఠి పొడి కలిపి తీసుకుంటే.. మేలు జరుగుతుంది. శొంఠిలో ఉండే రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీని పెంచుతుంది. ఫలితంగా వివిధ రకాల వ్యాధులకు చెక్ చెప్పవచ్చు అంటున్నారు నిపుణులు.

శొంఠి మహిళలకు చాలా ప్రయోజనకరం. పీరియడ్స్ సమయంలో నొప్పులు, క్రాంప్స్ తగ్గించేందుకు శొంఠి అద్భుతంగా పనిచేస్తుంది. సొంఠి తినడం వల్ల శరీరం మెటబోలింజం వేగవంతమవుతుంది అంటున్నారు నిపుణులు. ఫలితంగా బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. బరువు తగ్గించే ప్రక్రియలో సొంఠి అద్భుతంగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులకు కూడా శొంఠి సరైన పరిష్కారం అంటున్నారు.. సొంఠి తినడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

శొంఠిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే జలుబు, దగ్గు, గొంతులో గరగర సమస్యలుంటే అద్భుతంగా పనిచేస్తుంది. శొంఠి తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమౌతుంది. అంతేకాకుండా కడుపులో గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలు దూరమవుతాయి. సొంఠి వాతాన్ని సమతుల్యం చేస్తుంది. గ్యాస్‌, కడుపు ఉబ్బరం సమస్య ఉంటే.. గోరువెచ్చని నీటిలో శొంఠి పొడి వేసుకుని తాగితే.. ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..