వేపాకు నీటితో స్నానం చేస్తే ఈ సమస్యలన్నీ దూరం.. అద్భుతమైన మెరిసే చర్మం..!

|

Aug 14, 2024 | 5:42 PM

వేప ఆకు నీటితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల ముఖానికి సహజమైన మెరుపు వస్తుంది. వేప ఆకు నీటితో తలస్నానం చేయడం వల్ల చుండ్రు తొలగిపోయి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. వేప ఆకులను వేడి నీటిలో కడిగి, రంగు మారే వరకు వడకట్టండి. ఆ తరువాత స్నానం చేసే నీటిలో కలపండి. వారానికి రెండు మూడు సార్లు ఈ నీటితో స్నానం చేయండి.

వేపాకు నీటితో స్నానం చేస్తే ఈ సమస్యలన్నీ దూరం.. అద్భుతమైన మెరిసే చర్మం..!
Neem Water Bath
Follow us on

వేప చెట్టు.. మనకు ప్రకృతి ప్రసాదించిన ఔషధగని..ఆయుర్వేదంలో ఈ చెట్టు ఉపయోగాలు అనేకం ఉన్నాయి. వేప చెట్టు మనకీ వంద శాతం ఉపయోగపడుతుంది. వేప చెట్టు ఆకులు, బెరడు, పువ్వు, కాయలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు. వేప ఆకుల నుంచి ఎండిపోయి చెట్టు వరకు చెట్టు మొత్తం అనేక మనకి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. వేపలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వేప ఆకులు శరీరానికి హానీకరమైన ప్రీ రాడికల్స్‌తో పోరాడటంతో పాటు ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో వేప ఆకులు తోడ్పడతాయి. అంతేకాదు.. రోజూ మనం స్నానం చేసే నీటిలో వేప ఆకులను కలుపుకోవడం ద్వారా అద్బుతమైన చర్మ ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

వేపలో యాంటీ-ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. ఇది మంచి యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. వేప ఆకు నీటితో స్నానం చేయడం వల్ల అనేక చర్మ సమస్యలు నయమవుతాయి. ఇది మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ముఖంపై ఉన్న నల్ల మచ్చలను తొలగించడంలో వేప ఆకులు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. వేప ఆకులను పేస్ట్ లా చేసి అందులో 2 స్పూన్ల పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇది నల్ల మచ్చలను తొలగిస్తుంది.

శరీరంలో బ్యాక్టీరియా ఉత్పత్తి కావడం వల్ల ఎక్కువ చెమట పట్టడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వేప నీళ్లతో తలస్నానం చేయడం వల్ల చెమట దుర్వాసన తొలగిపోయి చర్మాన్ని కాపాడుతుంది. వారానికోసారి వేప లేదా వేప ఆకు నీటితో తలస్నానం చేస్తే చుండ్రు పోతుంది. వేప ఆకు నీటిని వాడేటప్పుడు షాంపూ వాడకపోవడమే మంచిది. శరీరంపై బొబ్బలు, అల్సర్లతో బాధపడేవారికి వేప ఆకు నీటి స్నానం దివ్యౌషధం. ఇది శరీరంపై బొబ్బలు, దద్దుర్లు సమస్యను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

వేప ఆకు నీళ్లతో తలస్నానం చేయడం వల్ల మొటిమల సమస్యలు తొలగిపోయి, ముఖం కాంతివంతంగా మారుతుంది. వేప ఆకు నీటితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల ముఖానికి సహజమైన మెరుపు వస్తుంది. వేప ఆకు నీటితో తలస్నానం చేయడం వల్ల చుండ్రు తొలగిపోయి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. వేప ఆకులను వేడి నీటిలో కడిగి, రంగు మారే వరకు వడకట్టండి. ఆ తరువాత స్నానం చేసే నీటిలో కలపండి. వారానికి రెండు మూడు సార్లు ఈ నీటితో స్నానం చేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..