Benefits Of Aloe Vera Oil: కలబందలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అలోవేరా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఇది రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా శరీర జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. ఇది అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అదే సమయంలో ఇది జుట్టు బలంగా మారడానికి, చర్మం నిగారింపు కోసం ఉపయోగిస్తారు. అయితే అలోవెరా జెల్ మాత్రమే కాదు, దాని నూనె కూడా జుట్టు, చర్మానికి మేలు చేస్తుందన్న విషయం మీకు తెలుసా..? తెలియకపోతే ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి. అలోవెరా ఆయిల్ జుట్టును బలోపేతం చేయడానికి, చిట్లకుండా ఉండేలా పోషకాలను అందిస్తుంది. కలబంద నూనె జుట్టు, చర్మానికి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
అలోవెరా ఆయిల్ ప్రయోజనాలు..
చుండ్రు సమస్యను దూరం చేస్తుంది
చాలామంది జుట్టు, చుండ్రు సమస్యతో బాధపడుతుంటారు. అయితే.. చుండ్రు సమస్యను తొలగించడానికి కలబంద నూనెను ఉపయోగించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్కాల్ప్ నుంచి డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడంలో కూడా కలబంద నూనె చాలా మేలు చేస్తుంది. దీన్ని సహజమైన హెయిర్ క్లెన్సర్‌గా కూడా ఉపయోగించవచ్చు.
జుట్టు దృఢంగా, మందంగా తయారవుతుంది..
జుట్టును బలంగా, మందంగా, పొడవుగా పెరిగెలా చేయడానికి కలబంద నూనె చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే లక్షణాలు జుట్టు పెరుగుదలను వేగవంతం చేయడానికి పని చేస్తాయి. అలోవెరాలో ఉండే ఖనిజాలు, ఎంజైములు జుట్టును బలంగా, పొడవుగా మార్చుతాయి.
చర్మాన్ని మెరిసేలా చేస్తుంది..
చర్మం గ్లో లేదా ప్రకాశాన్ని పెంచడానికి కలబంద నూనెను ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే విటమిన్లు, ఇతర లక్షణాలు చర్మానికి పోషణను అందిస్తాయి.
పొడి చర్మానికి మేలు చేస్తుంది..
అలోవెరా ఆయిల్ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, మాయిశ్చరైజ్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని ఆరోగ్యవంతంగా మార్చుతాయి. పొడి చర్మం ఉన్నవారికి కలబంద నూనె వాడకం చాలా మేలు చేస్తుంది.
ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..