Life Style: భార్యాభర్తలు ఆ తప్పులు అస్సలు చేయొద్దు.. ఆలా చేస్తే తీవ్ర పరిణామాలు.. నిపుణుల వార్నింగ్
దాంపత్య (Married Life) జీవితంలో కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల జంటల మధ్య విభేదాలు ఏర్పడతాయి. కలిసి జీవిస్తున్నప్పటికీ ఒకరి మధ్య మరొకరికి సరైన సయోధ్య ఉండదు. ఫలితంగా నిరాశ, విచారం ఆవహిస్తుంది. పెళ్లి కాక ముందు మనకు చాలా అంచనాలు..
దాంపత్య (Married Life) జీవితంలో కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల జంటల మధ్య విభేదాలు ఏర్పడతాయి. కలిసి జీవిస్తున్నప్పటికీ ఒకరి మధ్య మరొకరికి సరైన సయోధ్య ఉండదు. ఫలితంగా నిరాశ, విచారం ఆవహిస్తుంది. పెళ్లి కాక ముందు మనకు చాలా అంచనాలు ఉంటాయి. కాబోయో భార్య అలా ఉండాలి. ఇలా చేయాలి. నా మాటే వినాలి అనే ధోరణి అబ్బాయిల్లో కనిపిస్తుంది. అమ్మాయిల్లోనూ ఇదే తరహా భావన ఉంటుంది. తీరా వారు ఒక్కటయ్యాక కొత్త జీవితం అనుకున్నంత సాఫీగా లేకపోతే వారి మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు, వారి కుటుంబాలు, కుటుంబ బాధ్యతలు వంటి అనేక కారణాల వల్ల ఆ అంచనాలు నెరవేరవు. అటువంటి పరిస్థితిలో, జంటలు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోలేరు. ప్రేమ లేని పరిస్థితిలో ఒకరితో ఒకరు ఎక్కువగా కమ్యూనికేట్ అవలేరు. కలిసి జీవిస్తున్నప్పటికీ ఒంటరిగానే ఉన్నామన్న భావన వస్తుంది. పెళ్లయిన ప్రారంభంలో దంపతులిద్దరూ ఎక్కువగా మాట్లాడుకోవడం, ప్రేమను ప్రదర్శించడం వంటివి కనబరుస్తారు. ఇవి వారిని దగ్గర చేస్తుంది. అయితే పని, కుటుంబం, ఆర్థిక కారణాల వల్ల దంపతుల మధ్య ఉండే అనుబంధం తగ్గుతుంది.
ఇంట్లో సరైన ప్రేమ దక్కకపోతే బయటి నుంచి పొందాలని ఆశ పడతారు. ఇందు కోసం సహోద్యోగులు లేదా ఇతర వ్యక్తుల పట్ల ఆకర్షితులవుతారు. ఇది త్వరగా శృంగార సాన్నిహిత్యానికి దారి తీస్తుంది. ఇది ఒకరిపై ఒకరు కోపం పెంచుకుని చివరకు పగ వరకు దారి తీస్తుంది. దీంతో రిలేషన్ షిప్ లో శాశ్వతంగా చీలిక వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దంపతులు వయస్సుతో సంబంధం లేకుండా తమ భాగస్వాములను గౌరవించడం, వారితో ఆలోచనలు మార్చుకోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. ఇద్దరి మధ్య ప్రేమ, గౌరవం, నమ్మకం, సామరస్యం, కమ్యూనికేషన్ సరిగ్గా ఉంటే ఎలాంటి చీలికలు రావని చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..