ఈ హర్బల్ టీతో కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదిలిపెట్టరు..

|

Dec 04, 2023 | 9:49 AM

వాము ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించడంలో, చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు..రోజుకు రెండు చెంచాల వాము పొడిని భోజనానికి ముందు నీటిలో కలిపి తాగినట్టయితే..రక్తంలో పెరిగిన కొలెస్ట్రాల్ శాతం వారం రోజుల్లో తగ్గుతుంది. ప్రతిరోజు వాముపొడిని మీ ఆహారంతో పాటు తీసుకుంటే.. అధిక కొవ్వు వల్ల వచ్చే గుండెనొప్పి, పక్షం వాతం వంటి ప్రమాదకర వ్యాధులను నిరోధించుకోవచ్చు.

ఈ హర్బల్ టీతో కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదిలిపెట్టరు..
Ajwain Water
Follow us on

మనం నిత్యజీవితంలో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం. వీటిలో, అత్యంత సాధారణ సమస్యలలో జీర్ణ సమస్యలు కూడా. గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ, గుండెల్లో మంట వంటివి సాధారణ జీర్ణ సమస్యలు. అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఈ సమస్యలన్నింటి నుండి విముక్తి పొందేందుకు ఉపయోగపడే ఓ దివ్యమైన డ్రింక్‌ ఉంది. ఇది సాంప్రదాయకంగా ఆయుర్వేదంలో ఔషధంగా కూడా పరిగణించబడుతుంది. రుచి, వాసన కోసం దీన్ని ఇంట్లో వివిధ వంటకాలలో వినియోగిస్తుంటారు. ఈ సూపర్‌ డ్రింక్‌ని వామును ఉపయోగించి తయారు చేస్తారు. ప్రతి రోజూ ఉదయం పరగడుపున వాముతో చేసే హెర్బల్ టీ తాగితే అనేక వ్యాధుల్ని దూరం చేయవచ్చు.

వాముతో నిజానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా చెప్పినట్లుగా వాము ప్రధానంగా జీర్ణ సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు. ముఖ్యమైన నూనెలు, ఖనిజాలు, విటమిన్లు వంటి మనకు అవసరమైన అనేక ముఖ్యమైన అంశాలకు వాము అద్భుతమైన మూలం. వాము నీటిని రోజూ తీసుకుంటే, అజీర్ణం, ఆమ్లత్వం నుండి బయటపడటానికి, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది.

మధుమేహాన్ని నియంత్రించడానికి మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా దీనిని తినవచ్చు. వాము ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించడంలో, చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు..రోజుకు రెండు చెంచాల వాము పొడిని భోజనానికి ముందు నీటిలో కలిపి తాగినట్టయితే..రక్తంలో పెరిగిన కొలెస్ట్రాల్ శాతం వారం రోజుల్లో తగ్గుతుంది. ప్రతిరోజు వాముపొడిని మీ ఆహారంతో పాటు తీసుకుంటే.. అధిక కొవ్వు వల్ల వచ్చే గుండెనొప్పి, పక్షం వాతం వంటి ప్రమాదకర వ్యాధులను నిరోధించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

స్త్రీలకు, బహిష్టు తిమ్మిరిని ఉత్తేజపరిచేందుకు, ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి వాము వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే వాములో కండరాలను ‘రిలాక్స్’ చేసి నొప్పిని తగ్గించే ప్రత్యేక సామర్థ్యం ఉంది. ఉదయం పరగడుపున వాముతో హెర్బల్ టీ తాగడం వల్ల బరువు అద్భుతంగా తగ్గుతుంది. వాములో ఉండే పోషకాలతో కేలరీలు వేగంగా కరుగుతాయి. ఫలితంగా బరువు తగ్గుతారు.

వీటన్నింటితో పాటు, చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా మార్చడంలో వాము చాలా సహాయపడుతుంది. వాము మొటిమలు, తామర, అనేక ఇతర చర్మ వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..