Ajwain Leaves: పిచ్చి ఆకులు అనుకుంటున్నారా.. ఇవి చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు..

|

Sep 25, 2024 | 12:49 PM

వాము ఆకుల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. వాము ఆకుల గురించి పెద్దగా ఇప్పుడు ఎవరికీ తెలియక పోవచ్చు. కానీ పూర్వం ఈ వాము ఆకుల్ని ఎంతో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వాము ఆకుల గురించి తెలియక చాలా మంది వీటిని పిచ్చి మొక్కలు అని అనుకుంటారు. ఆయుర్వేదంలో కూడా వాము ఆకుల్ని పలు రకాల రోగాలను నయం చేయడంలో ఉపయోగించేవారు. కానీ ఈ ఆకుల్లో ఉండే ఔషధ గుణాలే వేరు. ఇంతకు ముందు ఈ ఆకులతోనే వాము బజ్జీలు వేసేవారు. ఈ విషయం పెద్దగా..

Ajwain Leaves: పిచ్చి ఆకులు అనుకుంటున్నారా.. ఇవి చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు..
Ajwain Leaves
Follow us on

వాము ఆకుల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. వాము ఆకుల గురించి పెద్దగా ఇప్పుడు ఎవరికీ తెలియక పోవచ్చు. కానీ పూర్వం ఈ వాము ఆకుల్ని ఎంతో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వాము ఆకుల గురించి తెలియక చాలా మంది వీటిని పిచ్చి మొక్కలు అని అనుకుంటారు. ఆయుర్వేదంలో కూడా వాము ఆకుల్ని పలు రకాల రోగాలను నయం చేయడంలో ఉపయోగించేవారు. కానీ ఈ ఆకుల్లో ఉండే ఔషధ గుణాలే వేరు. ఇంతకు ముందు ఈ ఆకులతోనే వాము బజ్జీలు వేసేవారు. ఈ విషయం పెద్దగా ఎవరికీ తెలియక పోవచ్చు. ఈ ఆకులు తిన్నా.. కూరల్లో ఉపయోగించినా బోలెడు లాభాలు ఉన్నాయి. ప్రతి రోజూ ఒక్క ఆకు నమిలినా కూడా సర్వ రోగ నివారిణిగా పని చేస్తుంది. మరి వాము ఆకులను ఎలా తీసుకోవాలి? ఈ ఆకులు ఉపయోగించడం వల్ల లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

గ్యాస్, అల్సర్ సమస్యలు మాయం:

వాము ఆకులు తిన్నా, వీటిని ఆహారంలో చేర్చుకున్నా గ్యాస్, అజీర్తి, అల్సర్ వంటి సమస్యలు కంట్రోల్ అవుతాయి. గ్యాస్ సమస్యతో బాధ పడేవారు. ప్రతి రోజూ పరగడుపున ఈ ఆకు ఒక్కటి నమిలి తింటే సరిపోతుంది.

వెయిట్ లాస్ అవుతారు:

వాము ఆకులు నమిలి తినడం వల్ల అధిక బరువు, ఊబకాయం సమస్యలు కూడా అదుపులోకి వస్తాయి. ఈ ఆకులు తింటే జీవక్రియ రేటు అనేది పెరుగుతుంది. కాబట్టి బరువు తగ్గడంలో ఇవి చక్కగా పనిచేస్తాయి. పరగడుపున తినడం వల్ల ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది.

ఇవి కూడా చదవండి

బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది:

ప్రస్తుత కాలంలో చాలా మంది బ్యాడ్ కొలెస్ట్రాల్‌ సమస్యలతో కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు వాము ఆకులు తిన్నా, వాము ఆకులు మరిగించిన నీటిని తాగినా శరీరంలో పేరుకు పోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

వాము ఆకుల్లో ఎన్నో రకాల పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా అందుతాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచడంలో ఎంతో హెల్ప్ చేస్తాయి. సీజనల్ వ్యాధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా త్వరగా ఎటాక్ చేయకుండా చూస్తుంది.

శ్వాస కోశ సమస్యలు:

వాము ఆకు తిన్నా, నీటిని మరిగించిన తాగినా శ్వాస కోశ సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారు కూడా వాము ఆకులు నమిలి తీసుకోవడం చాలా మంచిది. చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..