Air Pollution: కాలుష్యం వలన వీరు మరణించే ప్రమాదం 30 శాతం ఎక్కువ.. ఈ రోగులు జాగ్రత్తగా ఉండాల్సిందే..

|

Nov 19, 2024 | 5:32 PM

రోజు రోజుకీ వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. దీంతో రకరకాల వ్యాధుల బారిపడే అవకాశం ఉందని.. ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్న్రు. ఇదే విషయంపై లాన్సెట్ జర్నల్ చేసిన అధ్యయనంలో చేసిన అధ్యయనంలో పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. వాయుకాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులలో మరణాల రేటును 20-30% పెంచుతుందని వెల్లడించింది. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ చివరి దశలో ఉన్న రోగులకు కాలుష్యం మరింత ప్రమాదకరమని పేర్కొంది.

Air Pollution: కాలుష్యం వలన వీరు మరణించే ప్రమాదం 30 శాతం ఎక్కువ.. ఈ రోగులు జాగ్రత్తగా ఉండాల్సిందే..
Air Pollution
Follow us on

దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక ప్రాంతాల్లో వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. ముఖ్యంగా ఢిల్లీలో AQI 400 కంటే ఎక్కువగా ఉంది. పెరుగుతున్న కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. కాలుష్యం కారణంగా ప్రజలు ఆస్తమా, బ్రాంకైటిస్, సిఓపిడి వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులపై ఈ వాతావరణ కాలుష్యం తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో ఉందని నిపుణులు చెబుతున్నారు. కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రోగుల పరిస్థితి మరింత దిగజారుతోంది. కాలుష్యం కారణంగా మరణించే ప్రమాదం కూడా 30 శాతం పెరుగుతుంది. ది లాన్సెట్ అనే మెడికల్ జర్నల్ చేసిన అధ్యయనంలో వాయు కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగుల మరణాల రేటును 20-30% పెంచుతుందని వెల్లడైంది. పెరిగిన AQI ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపిస్తుంది అనే విషయం తెలుసుకోవడానికి అనేక దేశాలలో క్యాన్సర్ రోగులపై పలు అధ్యయనాలు నిర్వహించారు. ఈ అధ్యయనాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితుల పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వెల్లడైంది.

కాలుష్యం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలో తేలింది. ఈ క్యాన్సర్ రోగుల రోగనిరోధక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. దీంతో కేన్సర్‌ రోగుల పరిస్థితి మరింత దిగజారుతోంది. కాలుష్యంలో ఉండే పర్టిక్యులేట్ పదార్థం PM 2.5, PM 10 ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాలుష్యంలో ఉండే ఈ చిన్న రేణువులు ఊపిరితిత్తుల్లోకి చేరి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మరింత దిగజార్చుతాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగుల ఊపిరితిత్తులు అప్పటికే అంటే క్యాన్సర్ కారణంగా దెబ్బతిని ఉంటాయి.. ఈ నేపధ్యంలో కాలుష్యం పెరిగితే క్యాన్సర్ రోగుల పరిస్థితి మరింత దిగజారుతోంది. క్యాన్సర్ రోగులు .. AQI చాలా కాలం పాటు 400 కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఉంటే.. ఈ క్యాన్సర్ రోగుల మరణాల రేటు పెరుగుతోంది.

ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు కాలుష్యం ఎంత ప్రమాదకరం అంటే

కాలుష్యంలో ఉండే నైట్రోజన్ డయాక్సైడ్ ఊపిరితిత్తులలో మంటను కలిగిస్తుందని పల్మోనాలజిస్ట్ డాక్టర్ భగవాన్ మంత్రి వివరిస్తున్నారు. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులలో వాపు సమస్య సాధారణ రోగుల కంటే చాలా తీవ్రమైనది. ఇది రోగి అనారోగ్యాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. దీంతో ప్రాణాపాయం పొంచి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కాలుష్యం ఊపిరితిత్తుల కణాలకు హాని కలిగిస్తుంది.

ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగుల ఊపిరితిత్తులను బాగా దెబ్బతీస్తుంది. ఇక కాలుష్యం వలన ఊపిరితిత్తుల కణాలకు హానికరం. దీని కారణంగా శరీరంలో ఆక్సిజన్ లేకపోవడం, శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది తలెత్తుతుంది. దీంతో కేన్సర్‌ రోగుల పరిస్థితి మరింత దిగజారుతోంది. పెరుగుతున్న కాలుష్యం చివరి దశలో ఉన్న క్యాన్సర్ రోగులను ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులను ఇబ్బంది పెడుతుంది. ఇది బాధితుల మరణానికి కారణం అవుతుంది.

ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటంటే?

  1. వాయు కాలుష్యాన్ని నివారించడానికి మాస్క్ ధరించండి
  2. ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ ఉపయోగించండి
  3. ఆరోగ్యకరమైన ఆహారం తినండి
  4. సమయానికి తగిన మందులను తీసుకోండి

 

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..